యాదాద్రి భువనగిరి జిల్లా:దేశంలో ఐపీఎల్ ( IPL )పీవర్ మొదలైంది.ప్రస్తుతం ఐపీల్ సీజన్ -17 నడుస్తున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రీడాభిమానులు క్రికెట్ ను వీక్షిస్తారు.
ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.మరోవైపు కొందరు దీనిని జూదంగా మార్చేస్తారు.
రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో టాస్ నుండి మొదలుకొని, ఎవరు ఎన్ని పరుగులు కొడతారు? కొట్టిన బాల్ సిక్స్ పోతుందా?ఫోర్ పోతుందా?ఎవరు ఎన్ని వికెట్లు తీస్తారు? ఏ జట్టు గెలుస్తుంది? వంటి వాటిపై జోరుగా బెట్టింగ్ చేస్తూ లక్షాలాది రూపాయలను చేతులు మారుస్తారు.ఇది ఎక్కడో మహానగరాల్లో జరిగితే ఏమోలే అనుకోవచ్చు.
కానీ, యాదాద్రి భువనగిరి జిల్లా ( Yadadri Bhuvanagiri )సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఏడాది ఒకసారి జరిగే ఐపిఎల్ సీజన్లో పెద్ద ఎత్తున బెట్టింగ్ దందా కొనసాగుతుంది.
రూ.1000 నుండి లక్ష వరకు ఈ బెట్టింగ్ నడుపుతూ కొందరు భారీగా డబ్బులు దందుకుంటూ యువతను చెడు మార్గంలోకి నెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.సులువుగా డబ్బులు సంపాదించాలని,ఈ దందాలో ఎక్కువ మొత్తంలో బెట్టింగ్ పెట్టి నష్టపోయి ఆత్మహత్యల వరకు వెళ్ళే ప్రమాదం లేకపోలేదు.
ఒక వేళా యువకులు ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టినచో డబ్బులు రాలేదని గొడవలకు పాల్పడే అవకాశం ఉంటుంది.ఓ మధ్యవర్తి ద్యారా బెట్టింగ్ వ్యవహారం నడిపిస్తారని, బెట్టింగ్( Betting ) లో గెలిచినా, ఓడినా అతనిదే బాధ్యతని,అనుకున్నట్లు డబ్బులు అందకుంటే రెచ్చిపోయి ఘర్షణలు జరిగే ఛాన్స్ కూడా ఉందని,కొందరు కేవలం ఈ బెట్టింగ్ దందాపై జీవిస్తారని స్థానికులు అంటున్నారు.
ఫోన్ల ద్వారా ఆన్లైన్( Online ) లో వ్యక్తుల మధ్యన జరుతున్న ఈ మహమ్మారిని అరికట్టే వారే లేరా అని గ్రామస్తులు వాపోతున్నారు.వయసు తేడా లేకుండా ఇష్టమొచ్చినట్టు యువకులు ఈ బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయి, ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారని, అధికారులు మాత్రం ఎక్కడా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని,కాదు ఇప్పటికన్నా పోలీస్ అధికారులు ముందస్తుగా నిఘా ఏర్పాటు చేసి, బెట్టింగ్ దందాకు పుల్ స్టాప్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.







