తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచి లాభాలను అందించిన సినిమాలలో 96 సినిమా( 96 movie ) ఒకటి.ఈ సినిమాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా క్లాసిక్ అని చాలామంది అభిమానులు భావిస్తారు.ఈ సినిమాలో బాలనటులుగా గౌరీ కిషన్, ఆదిత్య( Gauri Kishan, Aditya ) కలిసి నటించగా వీళ్లిద్దరూ తమ నటనతో ప్రాణం పోశారు.
ఆ బాలనటులు ఇప్పుడు పెరిగి పెద్దవాళ్లయ్యారు.
గౌరీకిషన్, ఆదిత్య కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.
అయితే గౌరీకిషన్, ఆదిత్య పెళ్లి చేసుకున్నట్టు కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.జాను, రామ్( Janu, Ram ) ల పెళ్లి ఫోటో అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలను వైరల్ చేశారు.
అయితే ఆ ఫోటోలు షూటింగ్ ఫోటోలు అని సమాచారం.షూటింగ్ ఫోటోలు రియల్ ఫోటోలు అని నెట్టింట వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
గౌరీ కిషన్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా కెరీర్ పరంగా బిజీగా ఉంటూ అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు.తమిళం, మలయాళం, తెలుగు భాషల ఆఫర్లతో ఆమె బిజీగా ఉన్నారు.96 రీమేక్ జానులో సైతం గౌరీ కిషన్ నటించి తన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే.గౌరీ కిషన్ యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
సోషల్ మీడియాలో సైతం తన క్రేజ్ తో ఆమె అదరగొడుతున్నారు.
గౌరీ కిషన్ కు గుర్తింపు వచ్చిన స్థాయిలో ఆదిత్యకు మాత్రం గుర్తింపు రాలేదు.ఆదిత్య తమిళంలో పలు సినిమాలలో హీరోగా నటిస్తుండగా ఆ సినిమాలతో ఏ స్థాయిలో గుర్తింపు వస్తుందో చూడాల్సి ఉంది.భవిష్యత్తులో గౌరీ కిషన్ స్టార్ స్టేటస్ ను అందుకుని భాషతో సంబంధం లేకుండా సత్తా చాటతారని కామెంట్లు వినిపిస్తున్నాయి.