ఏపీలో ప్రతిపక్ష పార్టీ టీడీపీపై( TDP ) విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మొన్న విశాఖ( Visakha ) తీరంలో పట్టుబడిన మాదకద్రవ్యాల కంటైనర్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.25 వేల మాదకద్రవ్యాలతో వచ్చిన ఈ కంటైనర్ టీడీపీకి చెందిన నేతలదంటూ పలు వార్తలు వినిపించాయి.ఆ పార్టీకి చెందిన నాయకుడికి చెందిన కంపెనీ అడ్రస్ తోనే కంటైనర్ బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిందంటూ టాక్ వినిపించింది.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారం మేరకు సీబీఐ మరియు కస్టమ్స్ అధికారులు రంగంలోకి దిగారు.‘ఆపరేషన్ గరుడ’( Operation Garuda ) పేరుతో కంటైనర్ లో సంయుక్తంగా సోదాలు నిర్వహించిన అధికారులు 25 వేల కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన ఇంకా కొలిక్కి రాకముందే విశాఖలో గంజాయి పట్టుబడిన సంఘటన చోటు చేసుకుంది.
విశాఖలో గంజాయి అక్రమ రవాణా సంచలనం సృష్టించింది.
జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో( Janmabhoomi Express ) రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.విశాఖ – అనకాపల్లి మార్గ మధ్యలో ప్రయాణికుడి నుంచి సుమారు 16 కిలోల గంజాయిని సీజ్ చేశారు.
ఈ గంజాయిని విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అదేవిధంగా… ఈ నెల 21న కొయ్యూరులోని డౌనూరులో సుమారు 17 బస్తాల గంజాయి పట్టుబడింది.రూ.26.60 లక్షల విలువ చేసే 532 కిలోల గంజాయిని ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఆపరేషన్ నిషిద్ధ రవాణా నిర్వహించిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.
మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు.పట్టుబడిన నిందితులు పాంగి సుందర్ రావు, పాంగి మాణిక్యం మరియు వంతల చిన్నాగా పోలీసులు గుర్తించారు.
అయితే ఈ గంజాయి అక్రమ రవాణాలోనూ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతల హస్తం ఉందంటూ పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒడిశా సమీపంలోని నేరేడుపల్లి నుంచి గుర్రాల మీదుగా కొయ్యూరు మండలంలోని బచ్చెంటకు గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.గ్రామంలో చేపట్టిన సోదాల్లో ఈ 532 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.నిషేధిత మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ పని చేస్తుందని చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు.
ఈ క్రమంలోనే మాదకద్రవ్యాల విక్రయాలు జరిపినా.అక్రమ రవాణా చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.