Allu Arjun : అల్లు అర్జున్ ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నా హీరో అల్లు అర్జున్ ( Allu Arjun )గంగోత్రి సినిమాతో ప్రారంభమైన ఆయన కెరియర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకునేంత వరకు ఎదిగిందనే చెప్పాలి.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి.

 Is Allu Arjun Still Sad About Doing That Movie-TeluguStop.com

ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) కోసం భారీ కసరత్తులను చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక సుకుమార్ కూడా ఈ సినిమా మీద భారీ ఎఫర్ట్ పెట్టి సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ అయినట్లైతే ఇక సుకుమార్ పాన్ ఇండియాలో స్టార్లుగా వెలుగొందుతున్నారనే చెప్పాలి.

 Is Allu Arjun Still Sad About Doing That Movie-Allu Arjun : అల్లు అ-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తన కెరియర్ లో చేసిన సినిమాలన్నింటిలో ఒక సినిమా చేసినందుకు మాత్రం ఆయన ఇప్పటికీ బాధపడుతున్నాడట.అది ఏ సినిమా అంటే గుణశేఖర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన వరుడు సినిమా( Varudu movie ) చేసినందుకు ఆయన ఇప్పటికీ చాలా ఫీల్ అయిపోతున్నాడంట.ఎందుకంటే తన కెరియర్ లో అలాంటి ఒక డిజాస్టర్ సినిమాని ఇప్పటివరకు చేయలేదట.

అందువల్లే ఆ సినిమాని ఎందుకు చేశానా అని తన సన్నిహితుల దగ్గర అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడని వార్తలు అయితే వినిపిస్తున్నాయి.అయితే అల్లు అర్జున్ గుణశేఖర్ తో సినిమా చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే గుణశేఖర్ అంతకుముందు ఒక్కడు లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తీసి ఉన్నాడు.కాబట్టి అల్లు అర్జున్ గుణశేఖర్ కి అవకాశం ఇచ్చాడు.లేకపోతే ఆయనకు అవకాశం ఇచ్చేవాడు కాదని చాలామంది చెబుతూ ఉంటారు…ఇక వీళ్ళ కాంబోలో ఆ తరువాత రుద్రమదేవి సినిమా కూడా వచ్చింది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube