సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఉన్నటువంటి సిద్ధార్థ్ ( Siddharth )అదితి రావు హైదరి ( Aditi Rao Hydari ) జంట రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.వీరిద్దరూ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటీనటులుగా కొనసాగారు.
అయితే వీరిద్దరూ కలిసి అజయ్ భూపతి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మహాసముద్రం ( Maha Samudram ) అనే సినిమాలో నటించారు.ఈ సినిమా సమయం నుంచి వీరిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపించారు.
ఇలా ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్లడం ఒకరి పట్ల ఒకరు తీసుకుంటున్నటువంటి శ్రద్ధ చూస్తే కనుక వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.ఇలా పలు సందర్భాలలో వీరి రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురైనప్పటికీ వీళ్లు మాత్రం తమ రిలేషన్( Relation ) గురించి బయట పెట్టకుండా కొట్టి పారేస్తూ వచ్చారు.అయితే ఎప్పుడో ఒకసారి వీరి రిలేషన్ బయట పెడతారని అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఈ జంట అందరికీ షాక్ ఇచ్చారు.
తమ ప్రేమ విషయాన్ని తెలియజేయకపోయినా ఏకంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.కానీ ఈ జోడి రహస్యంగా పెళ్లి( Secret Marriage ) చేసుకోవడంతో అందరూ ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవడం దేనికి అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.వీరిద్దరూ తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాథ స్వామి ఆలయ మండపం( Ranganathaswamy Temple )లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో వీరి వివాహ వేడుక జరిగింది.
హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకున్నారు.ఇలా పెళ్లి బంధంతో ఒకటైనటువంటి ఈ జంట తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించారు.అయితే వీరిద్దరికి ఇది రెండో వివాహం కావటం గమనార్హం.ఇక వీరి పెళ్లి విషయం తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.