Mythri Movie Makers : 2000 కోట్ల రూపాయలను పెట్టి అన్ని భాషల్లో సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థ

అన్ని భాషల్లో సినిమాలను తీస్తూ పాన్ ఇండియా స్టార్స్ గా వెలుగుందుతున్నారు మన తెలుగు హీరోలు.కానీ కేవలం హీరోలు మాత్రమే ఫ్యాన్ ఇండియా అయితే ఎలా.

? నిర్మాతలు మాత్రం ఏం తక్కువ తిన్నారు.అందుకే ఈ లోటు భర్తీ చేయడానికి అన్ని భాషల్లో సినిమాలు నిర్మిస్తూ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ అని అనిపించుకోవాలని పరితపిస్తున్నారు ప్రస్తుతం మైత్రి మూవీస్( Mythri Movies ) వారు.

వీరు అన్ని భాషల్లో డబ్బులను పెడుతూ ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలను ఏకకాలంలో నిర్మాణ దశలో ఉన్న సినిమాలకు ఖర్చు పెడుతున్నారట.ప్రస్తుతం ఈ రేంజ్ లో ఇండియాలో వేరే ప్రొడక్షన్ హౌస్ ఏది కూడా ఖర్చు పెట్టడం లేదు.

ఇంతకి ఇప్పుడు మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఆ సినిమాలు ఏంటి ? ఒక్కో చిత్రానికి ఎంత బడ్జెట్ పెడుతున్నారు ? సదరు చిత్రాలు ఏ భాషలో వస్తున్నాయి ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisement

తమిళం, హిందీ భాషలతో పాటు తెలుగులో కూడా భారీ పెట్టబడులు పెట్టింది మైత్రి మూవీస్.ఈ దోవలో మొదట పుష్ప 2( Pushpa 2 ) చిత్రానికి 300 కోట్ల రూపాయల బడ్జెట్ నీ పెట్టారు.ఈ సినిమా ద్వారా ఏకంగా 500 కోట్ల రూపాయలు రిటర్న్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.

ఇది కాకుండా ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమాకి సైతం 300 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించారట.ఇక దీనికి వెయ్యి కోట్లకు పైగా రిటర్న్స్ వస్తాయని అంచనాలో ఉన్నారు.

పవన్ కళ్యాణ్ తో సైతం ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) చిత్రాన్ని నిర్మిస్తున్న ఇది కేవలం తెలుగులోనే నిర్మాణం జరుగుతున్నప్పటికి 200 కోట్ల రూపాయలను బడ్జెట్ గా పెట్టుకున్నారు మైత్రి వారు.

రామ్ చరణ్ ( Ram Charan ) తదుపరి తదుపరి రెండు చిత్రాలకు ఏకంగా 500 కోట్ల రూపాయలను బడ్జెట్ గా కేటాయించారట.ఇవి బుచ్చిబాబు మరియు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నాయి.ఇవే కాకుండా మలయాళం, తమిళ్ లో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు.

విరుపాక్ష తర్వాత సంయుక్త మీనన్ కి ఏమైంది ? ఆమె జోరు ఎందుకు తగ్గిపోయింది ?
మెగాస్టార్ విశ్వంభరలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారా.. అలా జరిగితే ఫ్యాన్స్ కు పండగే!

మలయాళం లో నడిగిర తిలకం అనే చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.ఇదే కాకుండా అజిత్ తో( Ajith ) కూడా ఒక సినిమా అనౌన్స్ చేశారు.దీనికి గుడ్ బాడ్ అగ్లీ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు.200 కోట్లతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.ఇదే కాకుండా హిందీలో గోపీచంద్ మలినేని సన్ని డియోల్ కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతుండగా మలయాళం లో మంజుమల్ బాయ్స్ అలాగే ఆడు జీవితం అనే రెండు సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు