Tollywood Hit Movies : కేవలం ఆ ఒక్క కారణంగానే సూపర్ డూపర్ హిట్టైన టాలీవుడ్ సినిమాలు !

ఒకప్పుడు స్టార్ హీరో ఉంటే చాలు సినిమా హిట్టే కావడం ఖాయం అనుకునే వారు చాలామంది.కానీ హీరో ఎంత పెద్ద తోపు అయినా సరే కథ బాగోలేకపోతే మూవీ అట్టర్ ఫ్లాప్ అవుతుందని అనడంలో సందేహం లేదు.

 Tollywood Movies Turns Hits Because Of Story Baahubali Manmadhudu Arya Chatrapa-TeluguStop.com

ప్రేక్షకులు స్టోరీ బాగుంటేనే సినిమాని హిట్ చేస్తారు.కొన్ని సినిమాలు అదృష్టం కొద్దీ స్టోరీ బాగోలేకపోయినా హిట్ అవుతాయి, అది వేరే సంగతి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోతో సంబంధం లేకుండా కేవలం కథ కారణంగానే సూపర్ హిట్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి.అవేవో తెలుసుకుందాం.

• స్టూడెంట్ నెంబర్ వన్

Telugu Allu Arjun, Arya, Baahubali, Chatrapathi, Manmadhudu, Nagarjuna, Prabhas,

రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్( Student No.1 Movie ) సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఈ మూవీలో ప్రతి సన్నివేశాన్ని తనదైన స్టైల్‌లో డైరెక్ట్ చేశాడు రాజమౌళి.మూవీ కథ బాగుండటం, దానిని నడిపించిన తీరు అద్భుతంగా ఉండటం వల్ల ఇది బిగ్గెస్ట్ హిట్ అయింది.

• ఛత్రపతి

Telugu Allu Arjun, Arya, Baahubali, Chatrapathi, Manmadhudu, Nagarjuna, Prabhas,

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కలిసి చేసిన ఛత్రపతి( Chatrapathi ) కూడా కథ కారణంగానే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.రాజమౌళి డైరెక్షన్, ప్రభాస్ మాస్ యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ మూవీ సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి.

• ఆర్య

Telugu Allu Arjun, Arya, Baahubali, Chatrapathi, Manmadhudu, Nagarjuna, Prabhas,

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఆర్య మూవీ( Arya Movie ) కూడా అద్భుతమైన స్టోరీతో చాలా మందిని ఆకట్టుకుంది.లవ్ ఎట్ ఫస్ట్ సైట్, వన్ సైడ్ లవ్ వంటి కాన్సెప్ట్స్‌తో వచ్చిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకులను బాగా మెప్పించి సూపర్ హిట్‌గా నిలిచింది.

• మన్మథుడు

Telugu Allu Arjun, Arya, Baahubali, Chatrapathi, Manmadhudu, Nagarjuna, Prabhas,

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అక్కినేని నాగార్జున చేసిన మన్మథుడు సినిమా( Manmadhudu Movie ) కూడా మంచి సక్సెస్ సాధించింది.ఈ సినిమా విజయానికి ఈ కారణం కథే అని చెప్పుకోవచ్చు.కె.విజయ భాస్కర్ దీనిని బాగా రూపొందించాడు.

• బాహుబలి

Telugu Allu Arjun, Arya, Baahubali, Chatrapathi, Manmadhudu, Nagarjuna, Prabhas,

బాహుబలి( Baahubali ) సినిమా కథ ఎంత బాగుంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.ఒక కథ మాత్రమే కాకుండా విజువల్ ఎఫెక్ట్స్, పాటలు ఇంకా నటీనటుల పర్ఫామెన్స్ అన్నీ కూడా వేరే లెవెల్ లో ఉంటాయి.కేవలం హీరో చరిష్మా తో కాకుండా ఇది మంచి కంటెంట్ తో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ సత్తాను గ్లోబల్ లెవెల్‌లో తెలియజేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube