Director Santhossh Jagarlapudi : భగవద్గీత గొప్పతనాన్ని చెప్పే సినిమా చేస్తున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి…

ఏదైనా ఒక విషయాన్ని చాలా డీప్ గా చెప్పాలన్న, చాలా ఎక్కువ మందికి తెలిసేలా చెప్పాలన్న దానికి చాలా మంది సినిమాని మాధ్యమంగా వాడుకుంటూ ఉంటారు.అందుకే సినిమా దర్శకులు ఎక్కువగా ఒక మెసేజ్ ని తన సినిమా ద్వారా ప్రేక్షకులకు చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

 Young Director Santhossh Jagarlapudi Is Making A Film About The Greatness Of Bh-TeluguStop.com

వాళ్ళ భావాలను సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలిసేలా చేస్తారు.ఇక సమాజానికి మంచి చేసే సినిమాలు చూసి మారిన వారు చాలామంది ఉన్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఇస్కాన్ వారు కూడా భగవద్గీత( Bhagavadgita ) యొక్క గొప్పతనాన్ని ఈ జనరేషన్ లో ఉన్న జనాలకి తెలియజేయాలనే ఒకే ఒక ఉద్దేశ్యంతో దాని గొప్పతనాన్ని తెలిసేలా ఒక సినిమాని రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు.దానికోసం ముందుగా ఒక షార్ట్ ఫిలిం ని తెరకెక్కించాలని ప్రయత్నం చేశారు.

 Young Director Santhossh Jagarlapudi Is Making A Film About The Greatness Of Bh-TeluguStop.com

ఇక అందులో భాగం గానే ప్రముఖ దర్శకుడు అయిన ‘సంతోష్ జాగర్ల పూడి'( Director Santhossh Jagarlapudi ) కి ఈ షార్ట్ ఫిలిం ని తెరకెక్కించే బాధ్యతని అప్పగించారు.ఇక దీనికి కథ ‘సత్యానంద్ హరిదాస్’ అందించారు.

సీతారాం ప్రభు నేతృత్వంలో అత్తాపూర్ ‘ఇస్కాన్ ‘( ISKCON ) ఆలయంలో దీనిని తెరకెక్కించారు.

Telugu Bhagavad Gita, Sumanth-Movie

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ షార్ట్ ఫిలిం త్వరలోనే అమెజాన్( Amazon ) తో సహా అన్ని అన్ని ఓటిటి ప్లాట్ఫారంలో అవలేబుల్ లో ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఇస్కాన్ వారు తమ గొప్పతనాన్ని తెలియజేయడానికి ఎప్పుడు కమర్షియల్ దర్శకులను ఆశ్రయించరు.అలాంటిది సంతోష్ జాగర్లపూడి లాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళే ఈ సినిమాని చేయమని చెప్పడం అనేది నిజంగా దర్శకుడు యొక్క ప్రతిభకు కొలమానమనే చెప్పాలి.

ప్రస్తుతం ఆయన సుమంత్ హీరోగా మహేంద్ర గిరి వారాహి( Mahendragiri Vaarahi ) అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.డైరెక్టర్ సంతోష్ చాలా బిజీగా ఉండి కూడా ఆయన భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని ఒకే ఒక కాన్సెప్ట్ తో వాళ్ల నిర్ణయానికి ప్రాధాన్యతనిస్తూ షార్ట్ ఫిలిం ని తెరకెక్కించడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్పాలి… ఇక సంతోష్ జాగర్లపూడి లాంటి దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు.

Telugu Bhagavad Gita, Sumanth-Movie

ఒక కథని నమ్మి దానికోసం ఎన్ని సంవత్సరాలైనా కాంప్రమైజ్ అవ్వకుండా తన కథ మీద నమ్మకం తో ట్రావెల్ చేసే ఒకే ఒక దర్శకుడు సంతోష్…ఇక ఆయన పట్టుదలే ఆయన్ని ముందుకు నడిపిస్తుంది.ప్రస్తుతం ఆయన సుమంత్( Sumanth ) తో చేస్తున్న వారాహి సినిమా బడ్జెట్ మొదట 8 కోట్లు అనుకున్నప్పటికీ, అది 15 కోట్లు దాటిన కూడా ప్రొడ్యూసర్ మాత్రం సంతోష్ కథ మీద నమ్మకంతో ఆయన సినిమా కోసం పడే కష్టాన్ని డైరెక్ట్ చూస్తున్నాడు కాబట్టి కేవలం సంతోష్ ను ఆయన కథను నమ్మి ప్రొడ్యూసర్ కూడా సంతోషంగా ఈ సినిమాకి డబ్బులు పెడుతున్నట్లుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ కొట్టడానికి సంతోష్ జాగర్లపూడి కూడా రెఢీ అవుతున్నాడు…ఇక ఇప్పటికే సంతోష్ తో సినిమా చేయడానికి మాస్ మహారాజా రవితేజ కూడా కమిట్ అయినట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube