గురువులంటే.తమ విద్యార్థులను( Students ) క్రమశిక్షణలో ఉంచి మంచి, చెడు బోధించి అనేక విషయాలను చెప్పి వారిని ప్రయోజకులను చేయడం.
అయితే రోజురోజుకి గురువు ( Teacher ) అనే పదానికి కొందరు మచ్చ తెస్తున్నారు.వారి నిధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థులను గాలికి వదిలేస్తున్నారు.
కొందరు ఉపాధ్యాయులు అయితే మరి ఘోరంగా స్కూల్ కు వచ్చి జీతం తీసుకుంటే చాలు అన్న ధోరణిలో పనిచేస్తున్నారు.మరికొన్ని చోట్ల అయితే వారికి తోచిన సమయంలో వచ్చిపోతూ వారి ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నారు.
కొన్ని చోట్ల కొందరు ఉపాధ్యాయులు పట్టపగలు వారు చేస్తున్న ఉద్యోగాన్ని మరిచిపోయి మద్యం సేవించి పాఠాలు బోధించడానికి పాఠశాలలకు వెళ్తున్నారు.మరికొందరైతే మద్యం సేవించి పాఠశాలకు వెళ్లి ఓ మూలన చాప వేసుకుని పడుకుంటున్నారు.
తాజా ఇలాంటి సంఘటన ఒకటి చతిస్ ఘడ్ రాష్ట్రంలో( Chattisgadh ) జరిగింది.
ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఓ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుడు ప్రతిరోజు ఫుల్లుగా మద్యం సేవించి పాఠశాల వస్తున్నాడు.అలా వచ్చిన ఉపాధ్యాయుడు ఊరికే ఉండకుండా పిల్లలను పనికిమాలిన మాటలు, బూతులతో అరుస్తూ పాఠశాలలో( School ) ఒక మూలకు చాప వేసుకుని నిద్రపోతున్నాడు.
అయితే ఇలా అన్ని రోజులు సాగవు కదా.ఇలా తాజాగా ఆ ఉపాధ్యాయుడు బాగా మద్యం సేవించి( Drunk ) స్కూలుకు వచ్చి తన విద్యార్థులపై బూతుల పురాణం అందుకున్నాడు.దాంతో విద్యార్థులు అందరూ రెచ్చిపోయి అతనిపై చెప్పుల వర్షం కురిపించారు.
దీంతో సదరు ఉపాధ్యాయుడు వారి బారి నుండి తప్పించుకోవడానికి తన స్కూల్ నుండి తన బైక్ పై పారిపోయాడు.అతడు బైక్ పై స్కూల్ బయటకు వెళ్తున్న సమయంలో విద్యార్థులు చెప్పులతో దాడి చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఓసారి చూసేయండి.