ఏపీ బీజేపీలో సీట్ల పంచాయతీ కొనసాగుతోంది.టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుతో వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవనున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పొత్తుల్లో భాగంగా బీజేపీ ఆరు ఎంపీ స్థానాలను ప్రకటించింది.అయితే తమకు అవకాశం కల్పించలేదని కొంతమంది సీనియర్ నేతలు పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు.
ఇందులో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ సీటు ఆశించి జీవీఎల్ నరసింహరావు( GVL Narasimha Rao ) భంగపడిన సంగతి తెలిసిందే.

ఇదే తరహాలో రాజమండ్రి సీటును సోము వీర్రాజు( Somu Veerraju )తో పాటు నర్సాపురం, రాజంపేట, తిరుపతి సీట్లలోనూ టికెట్లను ఆశించిన పార్టీ సీనియర్ నేతలు భంగపడ్డారు.ఈ నేపథ్యంలోనే తమకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఇటీవలే పార్టీ జాతీయ నాయకత్వానికి సీనియర్లు లేఖ కూడా రాశారు.ఈ రెండు రోజుల్లో అసెంబ్లీ సీట్ల ప్రకటన ఉన్న నేపథ్యంలో సీనియర్లు ఢిల్లీ బాట పట్టారు.
కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకైనా అవకాశం ఇవ్వాలని బీజేపీ సీనియర్లు హైకమాండ్ ను కోరనున్నారు.
తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!