Janasena : జనసేన అభ్యర్థుల జాబితా విడుదల..!!

2024 ఎన్నికలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే.

ఎట్టి పరిస్థితులలో వైసీపీకి అధికారం దక్కకూడదని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా టీడీపీ-బీజేపీ-జనసేన ( TDP-BJP-Janasena )కూటమి ఏర్పడటంలో కీలకపాత్ర పోషించారు.

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలు రెండు లోక్ సభ స్థానాలు కేటాయించడం జరిగింది.

ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే 18 మంది అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది.

1.పిఠాపురం - పవన్ కల్యాణ్ 2.నెల్లిమర్ల - లోకం మాధవి 3.

Advertisement

అనకాపల్లి - కొణతాల రామకృష్ణ 4.కాకినాడ రూరల్ - పంతం నానాజీ 5.

రాజానగరం- బత్తుల బలరామకృష్ణ 6.తెనాలి - నాదెండ్ల మనోహర్ 7.

నిడదవోలు - కందుల దుర్గేశ్ 8.పెందుర్తి - పంచకర్ల రమేష్ బాబు 9.

యలమంచిలి - సుందరపు విజయ్ కుమార్ 10.పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ 11.రాజోలు - దేవ వరప్రసాద్ 12.

విరుపాక్ష తర్వాత సంయుక్త మీనన్ కి ఏమైంది ? ఆమె జోరు ఎందుకు తగ్గిపోయింది ?
పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి .. ఇట్లు మీ చిరంజీవి

తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్ 13.భీమవరం - పులపర్తి ఆంజనేయులు 14.

Advertisement

నరసాపురం - బొమ్మిడి నాయకర్ 15.ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు 16.

పోలవరం - చిర్రి బాలరాజు 17.తిరుపతి - ఆరణి శ్రీనివాసులు 18.

రైల్వే కోడూరు - డా.యనమల భాస్కర రావు ఎంపీ స్థానాల విషయానికి వస్తే కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి పేర్లను జనసేన వెల్లడించింది.కాగా అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణ అసెంబ్లీ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆ పార్టీ వెల్లడించింది.

తాజా వార్తలు