ఒక్కోసారి ఎవరితోనైనా కొట్లాడే సమయంలో నీకంటే కుక్కలైనా విశ్వాసంగా ఉంటాయి అంటూ మాట్లాడుతూ ఉండడం గమనిస్తూనే ఉంటాం.కుక్కలు విశ్వాసానికి మారుపేరుగా ఉన్న కొన్నిసార్లు మాత్రం అవి చేసే పనులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి.
కారణాలు ఏవైనా సరే.కొన్నిసార్లు కుక్కలు వృద్ధులు, చిన్నపిల్లలపై దాడులు చేసిన సంఘటనలు అనేకం.ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి.ప్రస్తుతం ఈ రకానికి సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.ఓ పిల్లోడు దగ్గరలోని కుక్క పదేపదే విసిగిస్తుందని ఆ కుక్కకు గట్టి షాక్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social media ) వైరల్ గా మారింది.
ఈ వీడియోని చూసిన నటిజన్స్ పిల్లాడిని నీకు కోపం మామూలుగా లేదురా బుడ్డోడా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వీడియో ( Video )గమనించినట్లయితే.ఓ పిల్లోడు తన స్కూల్ బ్యాగు( School bag ) తీసుకుని ఇంటి బయట ఉన్న ఆటోలో వేసేందుకు పలుమార్లు ప్రయత్నిస్తాడు.అలా ప్రయత్నిస్తున్న సమయంలో తన కుక్క పదేపదేగా బ్యాగ్ ను వేయకుండా అడ్డుకుంటుంది.
బ్యాగు వేసే ప్రతిసారి కుక్క పిల్లాడికి అడ్డు రావడంతో బుడ్డోడికి చివరికి కోపం వస్తుంది.దాంతో కోపద్రకుడైన పిల్లాడు ఏంటి నీ బాధ నాకు అన్నట్లుగా ఆ కుక్క( Dog ) చెవిని ఒక్కసారిగా గట్టిగా పట్టుకొని కొరికేశాడు.
పిల్లాడు కుక్కను కొరికేసే సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

పిల్లాడు కుక్కని కొరికేయడంతో ఆ కుక్క నొప్పిని భరించలేక పెద్ద ఎత్తున కెవ్వు అంటూ అరిచింది.ఈ ఘటన చూసిన అక్కడివారు నవ్వుకుంటూ ఉండడం గమనించవచ్చు.ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయగా నెటిజన్స్ వీడియోపై తెగ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కొందరైతే పిల్లాడు జాగ్రత్త అంటూ ఉండగా.మరికొందరైతే ఈ బుడ్డోడికి ఆవేశం మామూలుగా లేదుగా అని వివిధ ఎమోజీలతో వారి స్పందనను తెలియజేస్తున్నారు
.






