ప్రస్తుత జనరేషన్లో పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ఇదివరకు పెద్దల కాలంలో పెళ్లిళ్లు సాంప్రదాయబద్ధంగా వేదమంత్రాల మధ్య పూర్తయ్యేది.
కానీ ఇప్పుడు మెహేంది ఫంక్షన్ నుండి రిసెప్షన్ వరకు అనేక కొత్త రకాల కార్యక్రమాలను తీసుకువచ్చి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి అంగరంగా వైభవంగా పెళ్లిళ్లు జరుపుతున్నారు.ఈ మధ్యకాలంలో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కలిసి పెళ్లి స్టేజిపై డాన్సులు వేయడం కూడా ఎక్కువ అయిపోయింది.
ముఖ్యంగా పెళ్లి కొడుకుల కంటే పెళ్లికూతుర్లు డాన్స్( Brides dance ) వైరల్ గా మారడం మనం సోషల్ మీడియాలో గమనిస్తూనే ఉన్నాం.ప్రస్తుతం ఇందుకు సంబంధించి మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అప్పుడెప్పుడో.ఓ పెళ్లి కూతురు ‘బుల్లెట్ బండి’ ( Bullet bandi )అంటూ జానపద పాటతో పెళ్లి ఫంక్షన్ లో డాన్స్ వేసి ఓ ట్రెండ్ ను సెట్ చేసింది.ఇక అప్పుడు నుంచి అనేకమంది వారి పెళ్లిలలో వారికి ఇష్టమైన పాటలతో స్టేజి పైన డ్యాన్సులు వేయడం పరిపాటిగా మారింది.ఇక ప్రస్తుతం మరో పెళ్లికూతురు డాన్స్ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.
కాకపోతే ఈ వీడియో వైరల్ కావడంతో పాటు కాస్త వివాదాన్ని కూడా కొని తెచ్చుకున్నట్లు అయింది.దీనికి కారణం సంక్రాంతి కి రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాలోని పాట.పెళ్లికూతురు డాన్స్ వీడియోని చాలామంది మెచ్చుకొని ఆ వీడియోనికి మహేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను ట్యాగ్ చేయడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
మరికొందరైతే.పెళ్లిలో ఇలాంటి ఐటమ్ సాంగ్ ఏంటంటూ విమర్శలు చేస్తున్నారు.మరికొందరైతే.
మరీ పాత పద్ధతిలో కాకుండా కొత్తగా ఆలోచించారంటూ మెచ్చుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు.దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.