Ravi Teja : ఆ సినిమా విషయం లో రవితేజ కు హ్యండివ్వబోతున్న స్టార్ ప్రొడ్యూసర్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ( Ravi Teja ) లాంటి నటుడు మరొకరు లేరనే చెప్పాలి.ఈయన సాధించిన విజయాలు అతన్ని స్టార్ హీరోగా చేశాయి.

 Producer Kk Radha Mohan To Replace Ravi Teja With Another Hero In Vikramarkudu-TeluguStop.com

ఇక మొత్తానికైతే ఈయన చేసిన వరుస సినిమాల్లో అన్ని కూడా మంచి విజయాలు సాధించడంతో ఆయన జీరో నుంచి హీరోగా ఎదిగారు.ఇక ఇలాంటి క్రమంలోనే రవితేజ ప్రస్తుతం చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా( Mr.Bachchan Movie ) మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.దానికి తగ్గట్టుగానే ఆయన ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఈ సినిమా సూపర్ సక్సెస్ సాదించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమా తొందరగా ఫినిష్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక రీసెంట్ గా ప్రొడ్యూసర్ కే కే రాధా మోహన్( Producer KK Radha Mohan ) విక్రమార్కుడు 2( Vikramarkudu 2 ) సినిమా రైట్స్ ని తీసుకున్నట్టుగా తెలియజేశాడు.

 Producer Kk Radha Mohan To Replace Ravi Teja With Another Hero In Vikramarkudu-TeluguStop.com

అయితే ఈ సినిమాలో రవితేజ నటిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాని రాజమౌళి అయితే దర్శకత్వం చేసే అంచనాలు లేవు.కాబట్టి సంపత్ నంది( Sampath Nandi ) ఈ సినిమాను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో హీరోగా ఎవరు చేస్తున్నారు అనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి.

అయితే రవితేజ కి బదులు వేరే హీరోని తీసుకోవాలని కే కే రాధ మోహన్ అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది.మరి రవితేజ లేని విక్రమార్కుడు సినిమాని ప్రేక్షకులు చూస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇది ఇలా ఉంటే రవితేజని ఎందుకు వద్దంటున్నారు అంటే రవితేజకు ఉన్న మార్కెట్ చాలా తక్కువ ఆయన చెప్పే రెమ్యూనికేషన్ ఎక్కువ అడగడం తో దానివల్లే ఈ సినిమాలో రవితేజను తప్పించి, మరోక స్టార్ హీరోని తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమాలో తను చేస్తాడా లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube