తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు ( V Hanumantha Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) చేర్చుకోవడం సరికాదన్నారు.కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవాళ్లను కాదని గతంలో తమపై కేసులు పెట్టిన వాళ్లకు టికెట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే అధిష్టానం పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని చెప్పారు.అదేవిధంగా కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్( BRS ) పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఎవరైనా సీఎం వద్దకే రావాలన్న వీహెచ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే వాళ్ల వద్దకు వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం సరికాదని తెలిపారు.







