కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రాయడం ఖాయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( Union Minister Kishan reddy ) అన్నారు.సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో పర్యటించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.దేశ ప్రజలంతా మరోసారి ప్రధానిగా మోదీ( Narendra Modi )నే రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో బీజేపీ మూడు వందలకు పైగా సీట్లను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అలాగే మిత్ర పక్షాలతో కలిసి మరికొన్ని సీట్లు సాధించి మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.