R. Narayanamurthy : సినిమా రిలీజ్ కాకుండానే రివ్యూలు.. వాళ్లకు చేతులెత్తి మొక్కేసిన ఆర్.నారాయణమూర్తి!

ఒకప్పటి సినిమా రివ్యూలకు( movie reviews ) ప్రస్తుతం సినిమా రివ్యూ లకు చాలా తేడా ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే.ఒకప్పుడు సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత సినిమా రివ్యూ రాసేవారు.

 R Narayana Murthy Request To Reviewers At Tfja Health Card Distribution-TeluguStop.com

కానీ ప్రస్తుతం కానీ ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టివ్ కావడంతో ప్రివ్యూల రూపంలో సినిమా విడుదలకు ముందే రివ్యూలు వచ్చేస్తున్నాయి.ఒకప్పుడు సినిమా చూసి రివ్యూలు రాసేశారు.

కానీ ఇప్పుడు సినిమా చూస్తూనే రివ్యూలు రాస్తున్నారు.ఒక్కొక్కడైతే థియేటర్‌లో సినిమా చూస్తూనే ఫోన్‌ లో రివ్యూలు రాసేసి తన పైత్యాన్నంతా ఆ సినిమాపై చూపిస్తున్నాడు.

Telugu Yanamurthy, Narayanamurthy, Tfja, Tollywood-Movie

మూవీకోసం నటీనటులు ఎంత కష్టపడ్డారు.ఆ నిర్మాత ఎంత డబ్బు పెట్టాడన్నది పక్కనపెట్టి ఎవడి నోటికొచ్చింది వాడు వాగుతూ కనీసం సినిమా చూసి దాన్ని అర్ధం చేసుకునే టైం కూడా లేకుండా సినిమా చూస్తూనే రివ్యూలు రాసేసి అసలు ఆ సినిమాని ప్రేక్షకులు చూడనీయకుండా చేస్తున్నారు కొంతమంది రివ్యూవర్స్.అయితే ఇలాంటి రివ్యూలు రాసి సినిమాపై బతికేవాళ్ల కడుపు కొట్టొద్దని రిక్వెస్ట్ చేశారు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి( People’s Star R Narayana Murthy ).తాజాగా హైదరాబాద్‌లో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్( Telugu Film Journalist Association ) ఆధ్వర్యంలో అసోసియేషన్ డైరీ, ఐడికార్డు, హెల్త్ కార్డ్ పంపిణీ కార్యక్రమం జరిగింది.

Telugu Yanamurthy, Narayanamurthy, Tfja, Tollywood-Movie

ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ముఖ్య అతిథిగా హాజరు కాగా దిల్ రాజు, ఆర్ నారాయణ మూర్తి, తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, TFJA ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి తనదైన శైలిలో ప్రసంగించారు.తొలితగా జర్నలిస్ట్‌లకు ఇళ్లు మంజూరు చేయాలని.దాదాపు 90 శాతం మంది జర్నలిస్ట్‌లు పేదవారే ఉండటంతో వాళ్ల దగ్గర నుంచి పైసా తీసుకోకుండా ఫ్రీగానే ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాలని ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని కోరారు పీపుల్ స్టార్.

అనంతరం రివ్యూల గురించి మాట్లాడుతూ.ప్రభుత్వం ఉండచ్చూ ఉండకపోవచ్చు.కానీ పత్రిక మాత్రం ఉండాలి థామస్ జఫర్‌సన్ చెప్పిన మాట ఇది.వెయ్యి తుపాకులకంటే కాలానికి భయపడతానని చెప్పాడు నెపోలియన్ దటీజ్ పవర్ ఆఫ్ మీడియా.సినిమా జర్నలిజంలో కూడా గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు.ఒకప్పుడు సినిమా విడుదలైన వారం తరువాత రివ్యూస్ రాసేశారు.ఆ సినిమాలో ఇది మంచి చెడు అని రాసేశారు.కానీ ఇప్పుడు సినిమా రిలీజ్‌కి ముందే రివ్యూ సినిమా రిలీజ్‌కి ముందే పాయింట్లు.

వీళ్లు రాసే రివ్యూల వల్ల సినిమాలకు ఎవరూ రావడం లేదు.నిర్మాతలు నష్టపోతున్నారు.

కాబట్టి మీడియా మిత్రులారా? మీకు చేతులెత్తి మొక్కుతున్నా.దయచేసి సినిమా భవిష్యత్‌ని వెంటనే తేల్చేయకండి.

చూసేజనాల్ని కనీసం మూడు రోజులైనా చూడనీయండి.ఇది నా రిక్వెస్ట్ అంటూ చేతులు జోడించి మరి వేడుకున్నారు ఆర్ నారాయణ మూర్తి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube