టాలీవుడ్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఒకటి రెండు కాదు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అడరజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి.ఏ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో కూడా క్లారిటీ లేదు.
కల్కి, రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్ ఇలా చాలా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు ప్రభాస్.అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజాసాబ్ సినిమా మరొక ఎత్తు అని చెప్పవచ్చు.
మరి దీనికి కారణమేంటి? రాజా సాబ్‌లో ఉన్న అంత ప్రత్యేకత ఏమిటీ? ఆ సినిమాలో ఏమీ ఉండబోతోంది అన్న విషయానికి వస్తే.

మిగిలిన సినిమాల మాదిరిగా ఈ మూవీ బడ్జెట్ 400 కోట్లు కాదు.వీలైనంత తక్కువలో, వీలైనన్ని తక్కువ రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్.దానికి తగ్గట్లుగానే ప్లాన్ చేస్తున్నారు మారుతి( Maruthi ).ఇన్ని సినిమాలు చేస్తున్నప్పటికి మధ్యలో రాజా సాబ్‌కు డేట్స్ ఇస్తున్నారు ప్రభాస్.కావాలనుకున్నపుడు కాస్త పక్కనబెట్టి మిగిలిన సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు.
దానికి తగ్గట్లుగానే షెడ్యూల్స్ సిద్ధం చేస్తున్నారు మారుతి.రాజా సాబ్ గురించి తాజాగా అదిరిపోయే న్యూస్ వచ్చింది.
ఈ సినిమా కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తుంది.

అదేమిటంటే రాజా సాబ్‌కు( The Raja Saab ) రెమ్యునరేషన్ కాకుండా బిజినెస్‌లో వాటా తీసుకోవాలని ప్రభాస్ ఆలోచిస్తున్నారు.ఒకవేళ ఇదే కనుక నిజం అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ( People Media Factory )కనీసం 100 కోట్లకు పైగా ప్రస్తుతానికి మిగిలినట్లే.ఇందులోనూ విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉండబోతున్నాయి.
అందుకే బడ్జెట్ లిమిట్ లో ఉంచడానికే రాజా సాబ్‌కు ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది.ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఏ సినిమా ముందుగా వస్తుందో చూడాలి మరి. ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో కనీసం రెండు మూడు సినిమాలు హిట్ అయినా కూడా ప్రభాస్ క్రేజ్ మరింత పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.