తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.( Lokesh Kanakaraj ) ప్రస్తుతానికి ఈయన చేస్తున్న సినిమాలు అన్నీ వైవిధ్యమైన కథాంశం తో తెరకెక్కుతూ ఉంటాయి.
ఇక రీసెంట్ గా ఆయన చేసిన లియో సినిమా( Leo ) పెద్దగా ఆకట్టుకోనప్పటికీ కమలహాసన్ తో చేసిన విక్రమ్ సినిమా( Vikram ) మాత్రం సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది.ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ తో ఆయన ఇప్పుడు రజనీకాంత్ తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
అయితే హాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన ‘గాడ్ ఫాదర్’ సినిమా( God Father Movie ) స్ఫూర్తి తోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాలో రజనీకాంత్( Rajinikanth ) డాన్ గా కనిపించబోతున్నారని కొంతమంది అంటుంటే మరి కొంత మంది మాత్రం రజనీకాంత్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అంటూ వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక నిజానికైతే గాడ్ ఫాదర్ ఇన్స్పిరేషన్ తోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాలో రజనీకాంత్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటికే లోకేష్ కనకరాజు విక్రమ్ సినిమాతో కమలహాసన్ కి అదిరిపోయే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందించాడు.
ఇక అదే క్రమంలో రజనీకాంత్ కి కూడా ఒక మంచి సక్సెస్ ని అందిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ ను తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.తెలుగు నుంచి నాని( Nani ) కూడా ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే లోకేష్ కనకరాజు గాని, రజినీకాంత్ గారు స్పందిస్తేనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందని మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…
.