హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది.మల్కాజ్గిరిలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ( Thummala Nageswara Rao )అన్నారు.
రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీస్తుందని చెప్పారు.తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు( MP seats ) గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కాగా ఇప్పటికే మల్కాజ్ గిరి నియోజకవర్గంలో గెలుపు అభ్యర్థిది కాదని ముఖ్యమంత్రిదని సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.అయితే లోక్ సభ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ మెజార్టీ సీట్లను గెలవాలని యోచనలో ఉంది.