టీడీపీ నేత సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి( Kakani Govardhan Reddy ) అన్నారు.తనపై పదే పదే ఆరోపణలు చేయడం సోమిరెడ్డికి అలవాటేనని విమర్శించారు.
వాటాలు, అక్రమ లావాదేవీలు ఉన్నాయని చెప్పడం దారుణమని పేర్కొన్నారు.క్వార్జ్ మైన్స్ పై విచారణ జరిపిస్తామని సోమిరెడ్డి అంటున్నారన్నారు.
ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు సోమిరెడ్డి ( Chandramohan Reddy Somireddy )సిద్ధమా అని ప్రశ్నించారు.అదేవిధంగా రానున్న ఎన్నికల్లో సోమిరెడ్డి గెలిచేది లేదన్న మంత్రి కాకాణి మీ ప్రభుత్వం వచ్చేది లేదని స్పష్టం చేశారు.ఈ సారి కూడా ఏపీలో వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.