ఈడీ లాకప్ లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) భద్రతపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.ఈ క్రమంలోనే కేజ్రీవాల్ భద్రతపై ఆప్ వివరణ కోరింది.
దేశంలో మొదటిసారి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారని ఆప్ మంత్రి అతిశీ( Atishi Marlena ) అన్నారు.
ఈ మేరకు కస్టడీలో కేజ్రీవాల్ కు ఎలాంటి భద్రత చర్యలు తీసుకుంటున్నారన్న ఆమె ఎన్నికలకు దూరం చేయాలనే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని ఆరోపించారు.ఆప్ మరియు సీఎం కేజ్రీవాల్ కు ఇండియా కూటమి మద్ధతు ఇచ్చిందని తెలిపారు.ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని వెల్లడించారు.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.