ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల( Ys sharmila ) ఆ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఆమె ఏపీ అధికార పార్టీ వైసీపీని, సీఎం జగన్ టార్గెట్ చేసుకుని చేస్తున్న విమర్శలు టాపిక్ గానే మారాయి.రాజకీయ, వ్యక్తిగత విమర్శలతో జగన్ ను ఇరుక్కుని పెట్టే విధంగా విమర్శలు షర్మిల చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో షర్మిల విమర్శల ప్రభావం తీవ్రంగానే ఉండేలా కనిపిస్తోంది.ఇది ఇలా ఉంటే షర్మిల వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు షర్మిల ఆసక్తి చూపిస్తున్నారు.దీంతో ఆమె ఏ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారనే దానిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
అయితే షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి.తాజాగా కడప జిల్లా కాంగ్రెస్ నేతలతో షర్మిల భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా షర్మిల అనే కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని షర్మిల క్లారిటీ ఇచ్చారు.తనను విమర్శిస్తున్న వైసీపీ నేతలకు ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు.మా కలలు పక్కనపెట్టి మీరు ఏ కలలు కంటున్నారో చూసుకోవాలని సలహా ఇచ్చారు.
ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్( Visakhapatnam Steel Plant ) ను ప్రైవేటీకరణ కానివ్వమని, కడప ఎంపీగా ఉండి కూడా కడప స్టీల్ ప్లాంట్ పై పోరాటం ఎందుకు చేయడం లేదని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి( Avinash Reddy )ని షర్మిల ప్రశ్నించారు.ఇప్పటికే రాహుల్ గాంధీ సైతం షర్మిలను కడప నుంచి లోక్ సభకు పోటీ చేయాల్సిందిగా భారత్ జోడో న్యాయ్ యాత్రలో సూచించారు.

ఆమె కడప నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం రాయలసీమ జిల్లా ల్లో స్పష్టంగా కనిపిస్తుంది.ఇక కడప నుంచి వైస్ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ లేదా కుమార్తె సునీత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.షర్మిల కూడా కడప ఎంపీ స్థానం నుంచే పోటీ చేసేందుకే దాదాపుగా ఫిక్స్ అయిపోయారు.