మల్కాజ్గిరి పార్లమెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రత్యేక దృష్టి సారించారు.మల్కాజ్గిరి ఎన్నిక అభ్యర్థిది కాదన్న ఆయన ముఖ్యమంత్రిదని చెప్పారు.
ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాలని తెలిపారు.ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమన్న సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి క్యాంపెయిన్ మోడల్ రాష్ట్రమంతా అనుసరించాలని వెల్లడించారు.

మల్కాజ్గిరి( Malkajgiri ) పార్లమెంట్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్( Congress ) గెలవాలన్నారు.అదేవిధంగా హోలీ పండుగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందని తెలిపారు.అయితే మల్కాజ్గిరి ఏడు సెగ్మెంట్లలోని ముఖ్యమైన నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.







