తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలలో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని చూస్తోంది.17 లోక్ సభ స్థానాల్లోనూ బీఆర్ఎస్ విజయం సాధించే విధంగా ఆ పార్టీ అధినేత కేసిఆర్ వ్యూహరచన చేస్తున్నారు.ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినా, కొన్ని నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టారు.ముఖ్యంగా మెదక్ లోక్ సభ స్థానం విషయంలో బీఆర్ఎస్ వ్యవహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ టికెట్ ను ప్రకటించినప్పటికీ, మెదక్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు.ఈ టిక్కెట్ ను ఒంటేరు ప్రతాప్ రెడ్డి( Vanteru Pratap Reddy )కి ఇవ్వాలని కెసిఆర్ అధికారికంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ, అధికారికంగా దానిని ప్రకటించలేదు . కాంగ్రెస్ అభ్యర్థిత్వం తేలిన తరువాతే ఇక్కడి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో దీనిపై సస్పెన్స్ కొనసాగుతోంది.ఈ టికెట్ కోసం ఇద్దరు ముఖ్య నాయకులు పోటీ పడుతున్నారు.ఇంకా అనేకమంది రేసులో ఉన్నామని సంకేతాలు పంపిస్తున్నారు.
ముఖ్యంగా నరసాపూర్ మాజీ ఎమ్మెల్యే సులువుల మదన్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసినందుకు ఆసక్తి చూపిస్తున్నారు.కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నరసాపూర్ టికెట్ ను సునీతా రెడ్డికి ఖరారు చేయడంతో, ఎంపీ టికెట్ ఇస్తామని అప్పట్లో కేసీఆర్ హామీ ఇచ్చారు.
దీంతో ఇప్పుడు ఆ స్థానంపై ఆయన ఆశలు పెట్టుకున్నారు.మరో వైపు చూస్తే తమకే టికెట్ కేటాయించాలని సంగారెడ్డికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ లో చేరిన కాంటారెడ్డి తిరుపతిరెడ్డి కూడా బీఆర్ఎస్ అధినాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నారు.
అయితే కేసీఆర్( KCR ) మాత్రం ఒంటెరు ప్రతాప్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.ఒంటేరు ప్రతాప్ రెడ్డిని లోక్ సభ నియోజకవర్గ పరిధిలో పనిచేసుకోమన్నట్లుగా కేసీఆర్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే మెదక్ లోక్ సభ స్థానం నుంచి స్వయంగా కేసీఆర్ పోటీ చేసే ఆలోచనతో ఉన్నారని ,అక్కడ నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమని ప్రచారం తాజాగా ఊపందుకుంది.అందుకే ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారని, రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుచుకునే సీట్లలో మెదక్ ( Medak )సీటు ముందుంటుందని రాజకీయ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఇక్కడి నుంచే పోటీ చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.







