సినిమా ఇండస్ట్రీలో ఒక దారుణమైన కల్చర్ ఉంటుంది.తమకు నచ్చిన నటుడు లేదా నటి చనిపోతే వారిపై ఉన్న అభిమానంతో వారి చావుకు కారణం సదరు నటి నటుల పక్కన ఉన్న వారిపై మోపి వారిని మనం ద్వేషిస్తూ ఉంటాం.
ఉదాహరణకు శ్రీదేవి ( Sridevi )చనిపోయింది.ఆమె అతిలోకసుందరి అందరికీ కావాల్సిన అమ్మాయి.
మంచి నటి అంతకుమించిన అందగత్తె.ఆమె చనిపోతే నిజా నిజాలతో సంబంధం లేకుండా అందరూ బోనీ కపూర్( Boney Kapoor ) వల్లే చనిపోయిందని బోని ఫ్యామిలీ ఇబ్బందులు పెట్టిందని లేదా బాత్ టబ్ లో ముంచి వారే చంపేశారు అంటూ ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు రాసేశారు.
అదే నిజమని జనాలు బ్రమపడ్డారు.అలా చాలా సార్లు చాలామంది సెలబ్రిటీల చావులు వారి కుటుంబంలో ఉన్న వారి పైన లేదా వారి జీవితం నుంచి వెళ్లిపోయిన వారి పైన పడుతున్నాయి.
ఎవరి కష్టాలకు, నష్టాలకు మరొకరు బాధ్యులు కారు.శ్రీదేవి జీవితంలో ఏమైనా జరిగిందో ఆరోజు ఏం జరిగిందో ఎవరికీ తెలియకపోవచ్చు.
కానీ బోనికపూర్ చనిపోయిన సందర్భంలో మాత్రం ఆమెతో లేడు అదే నిజం.

ఆమె చావుకు అతడు కారణం కాదు, అలాగే చాలాసార్లు సెలబ్రిటీస్ విషయాల్లో ఇదే జరుగుతుంది.వాళ్లు మనకు ఎంతో ఇష్టం కాబట్టి వారు చనిపోవడాన్నీ మనం జీర్ణించుకోలేము.అందువల్లే ఆ లోటు పూడ్చుకోవడానికి ఆ నేపాన్ని మరొకరిపై మోపి ఆనంద పడుతూ ఉంటారు.
వారివల్లే ఇలా జరిగిందంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు.కానీ పెద్ద కుటుంబాల్లో ఏదైనా జరిగితే తట్టుకోవడానికి లేదా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి అవకాశాలు ఉంటాయి.
కానీ చిన్నచిన్న నటుల విషయంలో మాత్రం అలా జరగదు.ఉదాహరణకు కమెడియన్ విజయ్ సాయి( Vijay Sai ) మీకు అందరికీ గుర్తుండే ఉంటాడు.
అల్లరి సినిమా( Allari )తో బాగా పేరు సంపాదించుకున్న ఈ నటుడు ఇండస్ట్రీలో కెరియర్ కొనసాగించలేక పోయాడు.

కానీ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం వల్ల భార్యతో కూడా విభేదాలు వచ్చి ఆమె విడాకులకు అప్లై చేయడంతో ఆ ప్రెజర్ తట్టుకోలేక అలాగే కెరియర్ కూడా సాఫీగా లేకపోవడంతో అని ఇబ్బందులు కలిగి ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ చావుకు కారణం అతడి భార్య అని ట్రోల్ చేశారు.కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి అంటే ఆమె సింగిల్ గా తన కూతురిని పెంచుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతోంది.అందరూ ఆ టైంలో ఆమెను దూరం పెట్టారు.
సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి.సీరియల్స్ లో కూడా ఎవ్వరూ చాన్స్ ఇవ్వలేదు.
విజయ్ ఉన్నప్పుడు ఆమెకు ఇబ్బందులు తప్పలేదు.విజయ్ చనిపోయాక కూడా ప్రస్తుతం కూతురిని చదివించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంది.
చిన్న అవకాశం ఇవ్వండి అంటూ అందరిని ప్రాధేయపడుతుంది.అతడు ఫెయిల్ అయితే అది తన తప్పు కాదు.
కానీ నష్టం కష్టం పోయిన వారితో పోదు ఉన్నవారికి ఉంటుంది.ఇక పైన మీడియా కూడా ఇలాంటి తప్పులు చేయకుండా విషయాల్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా రాయడం వల్ల జనాలు కూడా అదే నిజమని నమ్ముతారు.
ఇలాంటివి ముందు ముందు జరగకుండా ఉండాలని అందరం కోరుకుందాం.