ఏపీలో బ్యానర్లు, పోస్టర్లు తొలగించామని సీఈవో ఎంకే మీనా( AP CEO MK Meena ) అన్నారు.ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న సీఈవో ఎంకే మీనా వచ్చిన ఫిర్యాదుల్లో 75 శాతం పరిష్కారం అయ్యాయని తెలిపారు.కొన్ని ఫిర్యాదుల పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతుందన్నారు.
అలాగే వాలంటీర్లు, వీఆర్వోలపై ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు.
ఈ క్రమంలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న సుమారు 46 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.
వాలంటీర్లపై( Volunteers ) మొత్తం 40 కేసులున్నాయన్న ఆయన ప్రతి కార్యక్రమానికి పార్టీలు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.ఈ మేరకు సువిధ యాప్( Suvidha App ) ద్వారా అనుమతి తీసుకోవాలన్నారు.
కార్యక్రమాల కోసం ఇప్పటివరకు 392 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.అదేవిధంగా ఏపీ సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టామని తెలిపారు.