ఉన్నట్టుండి మెగా హీరోలకు( Mega Heroes ) ఏమైంది.గత ఏడాది ఫుల్ జోష్ లో ఉన్న మెగా హీరోలందరు ఇప్పుడు వరస ఫ్లోప్స్ లో ఉన్నారు.
చిరంజీవి( Chiranjeevi ) గత ఏడాది వాల్తేరు వీరయ్య తో మంచి హిట్ కొట్టారు అలాగే సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కూడా మంచి కంబ్యాక్ ఇచ్చారు.రామ్ చరణ్ కి ( Ram Charan ) ట్రిపుల్ ఆర్ రూపం లో పెద్ద హిట్ తో పాటు ఆ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా దక్కింది.
అలాగే మెగా కుటుంబం లో కూడా రామ్ చరణ్ కి కూతురు పుట్టడం తో అన్ని మంచి శకునములే అన్న విధంగా ఉంది.
పుష్ప సినిమా తో అల్లు అర్జున్( Allu Arjun ) నేషనల్ హీరో అవ్వడం తో పాటు నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నాడు.కానీ బ్రో సినిమా( Bro Movie ) విడుదల అయినా టైం నుంచి అన్ని బ్యాడ్ ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి.పైగా ఈ సినిమా అటు సాయి ధరమ్ తేజ్ కి ఇటు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) విజయాన్ని అందించలేదు.
మరో వైపు వరుణ్ తేజ్( Varun Tej ) గాండీవదారి తో పాటు ఆపరేషన్ వాలెంటైన్ ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలియకుండా పోయాయి.ఇక రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమా చాల లేటుగా షూటింగ్ ని పూర్తి చేసుకుంటుంది.
పోయిన ఏడాది రావాల్సిన ఈ సినిమా ఈ ఏడాది కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు.చిరంజీవి కి ఆచార్య చిత్రం తర్వాత గాడ్ ఫాదర్ కూడా చాల పెద్ద దెబ్బ కొట్టింది.కళ్యాణ్ కృష్ణ తో చేయాల్సిన చిరు ప్రాజెక్ట్ ఆగిపోయింది.ఇక పవన్ కళ్యాణ్ ఓజి సినిమా( OG ) సెప్టెంబర్ లో వస్తుంది.చాల కాలంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం లేదు పవన్.ఇలా ఎటు చుసిన ఈ ఏడాది మెగా ఫ్యామిలి హీరోలందరికీ పరాజయాలు పలకరిస్తున్నాయి.
మరి వచ్చే ఏడాది అయినా మెగా హీరోల టైం చేంజ్ అవుతుందా లేదా అనేది వేచి చూస్తే కానీ తెలియదు.