కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గ ( Penamalur Constituency )సీటుపై టీడీపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.నియోజకవర్గంలో ఇప్పటికే ఎంఎస్ బేగ్, దేవినేని ఉమా( MS Baig, Devineni Uma ) పేరుతో పార్టీ అధిష్టానం ఐవీఆర్ఎస్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
దీనిపై మరో కీలక నేత బోడె ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.నియోజకవర్గం నుంచి పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేస్తానని బోడె ప్రసాద్( Bode Prasad ) చెబుతున్నారని తెలుస్తోంది.
లేదంటే ఆయనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతానని తేల్చి చెప్పారని సమాచారం.మరోవైపు పెనమలూరు రేసులోకి పలువురు టీడీపీ నేతలు ఎంట్రీ ఇచ్చారు.
పొత్తుల్లో భాగంగా తెనాలి సీటు కోల్పోవడంతో పెనమలూరుపై ఆలపాటి రాజా కూడా ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.అలాగే దేవినేని చందు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ సైతం పెనమలూరు నుంచి టికెట్ ఆశిస్తున్నారని సమాచారం.
దీంతో నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.







