ప్రతి మనిషి తన జీవితంలో ఎప్పుడు చనిపోతాడో ఎవరికీ తెలియదు.కానీ చనిపోయే రోజు నేను ఇంకా చావకుండా ఉంటే బాగుంటుంది లేదా నేను చూడాల్సిన జీవితం ఇంకా ఎంతో ఉంది అని బాధపడకుండా చనిపోతే చాలు.
అలా సర్వసాధారణంగా ఎవరు అనుకోరు.కానీ సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) మాత్రం ప్రపంచాన్ని ఎంత వరకు చూడాలనుకుంటున్నాడో అంత వరకు చూసే తీరుతాడట.
పైగా తాను చనిపోయే రోజు ఏ ఒక్కటి చూడలేదు అన్న బాధతో చనిపోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాడట.ఇది తన అన్నయ్య చనిపోయిన రోజు అనుకున్నాడట.
ఎందుకంటే ఆ రోజు అన్నయ్య ( Jr NTR Brother ) చనిపోతాడని ఎవరికి తెలియదు.తను చేయాల్సిన పనులు, చూడాల్సిన జీవితం ఎంతో ముందే ఉంది.
అయినా కూడా దేవుడు అర్ధాయుషుతో తీసుకెళ్లిపోయాడు.

అలా వెళ్ళిపోతాడు అని ఎవరైనా ఊహిస్తారా కానీ జరిగిపోయింది.జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు.అలాగే జరగబోతున్న దాన్ని కూడా ఎవరు మార్చలేము కాబట్టి చేయాల్సిన పనులన్నీ కూడా ముందే చేసేయాలి.
పిల్లల భవిష్యత్తుకు( Children Future ) సరిపడా అన్ని సెట్ చేయాలి.భార్య కూడా మనం లేని రోజు బాధపడకుండా ఉండాలి.తన పిల్లలు ఏమైపోతారో అని దిగులు ఆమెకు ఉండకూడదు.మనం జాగ్రత్తగా అన్ని సెటిల్ చేసి వెళ్ళిపోతే ఆ తర్వాత వాళ్ళు బాగుంటే చాలు.
ఎవరి చేతి కిందకి వెళ్ళకుండా ఉంటే చాలు.అయ్యో మా నాన్న ఉండి ఉంటే ఈ రోజు మా పరిస్థితి ఇలా ఉండేది కాదు అని వారు బాధ పడకుండా ఉంటే చాలు.
అందుకోసం ఏదైతే చేయాలో అన్నీ చేసెయ్యాలి.

అలా చేయకుండా వెళ్ళిపోయిన రోజు చచ్చినా బ్రతికినా ఒకటే.అందుకే ఖచ్చితంగా చెబుతున్న.ఇది నాకు మాత్రమే కాదు నన్ను ప్రేమిస్తున్న వారందరికీ చెబుతున్నా.
మీరు భవిష్యత్తు కోసం అన్ని జాగ్రత్తగా ఇప్పుడే చేసుకోండి .ఇప్పటి నుంచి ఏదైనా చేయకపోతే ఇకపై మొదలు పెట్టండి.మీరు లేని రోజు మీ కుటుంబం రోడ్డున పడకుండా ఉండటానికి జాగ్రత్తలు ప్రతిది తీసుకోండి.నా కుటుంబం ఇద్దరినీ ప్రమాదాల్లో కోల్పోయిన రోజు ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా మనసులో నిర్ణయించుకున్నాను.
ఆ విధంగానే అన్ని అనుగుణంగా చేసుకుంటూ వెళుతున్నాను.మీరు కూడా ఇదే విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రతిరోజు మీ ప్రయాణాన్ని కొనసాగించండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో ఎంతో ఎమోషనల్ గా మాట్లాడి అందరి చేత కన్నీళ్లు పట్టించినంత పని చేశాడు.







