RCB Team : డబ్ల్యుపిఎల్ లో బెంగుళూర్ టీమ్ కప్ కొట్టడం తో ఐపీఎల్ లో ఆర్సిబీ టీమ్ మీద ఒత్తిడి పెరుగుతుందా..?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్( Royal Challengers ) బెంగళూరు టీం ఫైనల్ లో ఢిల్లీ టీమ్ ను చిత్తు చేసి భారీ విజయాన్ని సాధించింది.ఈ సీజన్ లో ఫైనల్ కెళ్ళి ఘనవిజయాన్ని సాధించడంతో బెంగళూరు టీమ్ ( Bangalore team )అభిమానుల్లో మంచి ఆనందమైతే నెలకొంది.

 Will The Pressure On The Rcb Team In The Ipl Increase With Bangalore Team Winni-TeluguStop.com

ఇక నాలుగు రోజుల్లో స్టార్ట్ అవ్వబోయే ఐపీఎల్ కి ముందే బెంగళూరు ఉమెన్స్ టీం కప్పు కొట్టడం అనేది నిజంగా బెంగళూరు టీం కి ఒక శుభసూచకమనే చెప్పాలి.

ఇక ఇది ఇలా ఉంటే ఐపీఎల్( IPL ) లో బెంగళూరు టీం మీద ఇప్పుడు చాలా ఒత్తిడి కూడా పెరిగే అవకాశం అయితే ఉంది.ఎందుకంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్( Women’s Premier League ) రెండో సీజన్ లోనే బెంగళూరు టీం కప్పు కొట్టింది.ఇక గత 16 సీజన్ల నుంచి ఐపీఎల్ లో ఆడుతున్న బెంగళూరు టీమ్ మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు.

కాబట్టి ఈసారి కప్పు కొట్టకపోతే మాత్రం చాలా బెంగుళూరు టీమ్ ప్లేయర్లు దారుణమైన వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఒక విధంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు టీం గెలవడం ఆనందాన్ని ఇస్తే బెంగళూరు టీం కి మాత్రం ఒక టఫ్ ఫైట్ గా మారబోతుందని తెలుస్తుంది.

ఇక స్మృతి మందన టీం మొదటి సీజన్ లో చాలా వరకు తడబడ్డప్పటికీ ఈ సీజన్ లో మాత్రం కప్పు కొట్టి తన సత్తాను చాటుకుంది.ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals )రెండుసార్లు ఫైనల్ కి వచ్చి రెండుసార్లు ఓడిపోవడం అనేది వాళ్ల బ్యాడ్ లక్ అనే చెప్పాలి…మొదటి సీజన్ లో ముంబై మీద, ఈ సీజన్ లో బెంగుళూరు మీద ఓడిపోయి ఢిల్లీ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశారనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube