సాధారణంగా స్టార్ హీరో హీరోయిన్లను పెట్టి సినిమాలు తీస్తేనే ఒక్కోసారి అవి ఫెయిల్ అవుతుంటాయి.అలాంటిది మూగజీవులను హీరోలుగా పెట్టి సినిమాలు తీస్తే అవి సక్సెస్ అయ్యే అవకాశం చాలా తక్కువ.
ఒకట్రెండు సినిమాలంటే ఎమోషనల్ కంటెంట్ వల్ల సక్సెస్ కావచ్చు.వరుస పెట్టి అవే సినిమాలు తీసుకుంటూ వెళ్తే ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువ.
కానీ ఒక నిర్మాత మాత్రం ఈ భావన తప్పు అని నిరూపించాడు.ఆ ప్రొడ్యూసర్ పేరు శాండో చిన్నప్ప దేవర్( Sando Chinnappa Dewar ).ఈయన దేవర్ ఫిలింస్ ( Dewar Films )పేరిట ఒక ప్రొడక్షన్ హౌజ్ స్థాపించాడు.ఆ నిర్మాణ సంస్థ కింద తమిళ, హిందీ, తెలుగు భాషల్లో మొత్తంగా వందకు పైగా సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు.
ఆ సినిమాల్లో ఎక్కువ శాతం ఏనుగులు, పాములు, పులులు, ఆవులు, పొట్టేళ్లు వంటి జంతువులు హీరోలుగా లేదా ముఖ్య పాత్రల్లో నటించాయి.కొన్ని సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు ఉన్నా వారు కేవలం చిన్న పాత్రలు మాత్రమే పోషించేవారు.
జంతువుల మాత్రం కీలకమైన పాత్రలు పోషిస్తూ సినిమాలను నడిపించేవి.వీటినే పెట్టడానికి కారణమేంటంటే నిర్మాతకు మూగజీవులు అంటే చచ్చేంత ప్రాణం.
అందుకే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు.

ఈ నిర్మాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జంతువులను మచ్చిగా చేసుకుని వాటిని మెయిన్ లీడ్స్ గా తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు.ఇవి మనుషుల వలే కాల్ షీట్స్ ఎగ్గొట్టవని, ఎక్కువ డబ్బులు కావాలి, అది, ఇది కావాలి అని షరతులు కూడా విధించవని అతను చెప్పుకొచ్చాడు.మంచిగా ట్రైనింగ్ ఇస్తే జంతువులు చాలా చక్కగా నటిస్తాయని, మనుషుల వలె ఏ విషయంలోనూ అవి ఇబ్బంది పెట్టవని కూడా చిన్నప్పదేవర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

చిన్నప్పదేవర్ ‘పొట్టేలు పున్నమ్మ’ ( Pottelu Punnamma )పేరిట ఒక తెలుగు చిత్రాన్ని తీసి సూపర్ హిట్ అందుకున్నాడు.కోలీవుడ్‌లో నిర్మించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదల చేసి సక్సెస్ లు సాధించాడు.ఏనుగులు ప్రధాన పాత్రలో రజనీకాంత్ హీరోగా ‘అమ్మ ఎవరికైనా అమ్మ’ మూవీ( Amma avarikina amma ) తీసి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అయింది.
దీనికంటే ముందు ఇదే సినిమా కథతో హిందీలో ‘మా’ పేరుతో ఒక మూవీ ప్రొడ్యూస్ చేశాడు.ఏనుగు హీరోగా తీసిన ‘హాథీ మేరే సాథీ’ ( Hathi Mere Saathi )అనే మూవీ కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది.
ఈ సినిమాలో ఇండియాలోనే కాకుండా ఇతర ప్రపంచ దేశాల్లో కూడా రిలీజ్ అయి అక్కడ కూడా హిట్స్ గా నిలిచాయి.ఆవు ప్రధాన పాత్రలో ‘గాయ్ ఔర్ గౌరి’ ( Gai Aur Gauri )అనే సినిమాను కూడా ప్రొడ్యూ చేసి హిట్ అందుకున్నారు.
ఈ మూవీ చిత్రీకరణ సమయంలో ఆ ఆవు కోసం ప్రత్యేకంగా ఒక రూమ్ కూడా కట్టించారు.







