బహుజన్ సమాజ్ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar )రాజీనామా చేశారు.ఈ మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించారు.
ఈ క్రమంలో బరువెక్కిన హృదయంతో బీఎస్పీని( BSP ) వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.ఇటీవల కాలంలో తాను తీసుకున్న నిర్ణయాల వలన బీఎస్పీ ఇమేజ్ దెబ్బతినడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే తాను కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనకు పార్టీని వీడటం తప్ప మరో అవకాశం లేదని తెలిపారు.కాగా లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు బీఎస్పీని వీడిన తరువాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో సమావేశం కావడంతో ఆయన బీఆర్ఎస్ గూటికి చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.