సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ( Rajiv Kumar )మాట్లాడుతూ లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.
ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడితాతో పాటు సిక్కిం రాష్ట్రాలను ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ ఎన్నికల ప్రక్రియలో సుమారు కోటి 50 లక్షల మంది సిబ్బంది పాల్గొంటారని చెప్పారు.జూన్ 16 లోపు ఎన్నికల ప్రక్రియ( Central Election Commission )ను పూర్తి చేస్తామన్నారు.అలాగే దేశంలో మొత్తం 96 కోట్ల 80 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.వీరిలో కోటి 82 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారన్న సీఈసీ దివ్యాంగ ఓటర్లు 88.4 లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు.49 కోట్ల 70 లక్షల మంది పురుష ఓటర్లు, 47 కోట్ల పది లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని చెప్పారు.ఈసారి మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని రాజీవ్ కుమార్ వెల్లడించారు.







