స్వీట్ కార్న్( Sweet corn )పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో మందికి మోస్ట్ ఫేవరేట్ స్నాక్ ఇది.మామూలు కార్న్ తో పోలిస్తే స్వీట్ కార్న్ చాలా రుచికరంగా ఉంటుంది.
ముఖ్యంగా ఉడికించిన స్వీట్ కార్న్ ను దాదాపు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.అలాగే స్వీట్ కార్న్ తో రకరకాల రెసిపీలు కూడా తయారు చేస్తుంటారు.
స్వీట్ కార్న్ లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.మెగ్నీషియం, ఐరన్, కాపర్, మాంగనీస్, జింక్, సెలీనియం, విటమిన్ బి, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు స్వీట్ కార్న్ ద్వారా పొందవచ్చు.
ఆరోగ్యపరంగా స్వీట్ కార్న్ అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది.స్వీట్ కార్న్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి.మలబద్ధకాన్ని నివారించడానికి తోడ్పడుతుంది.
స్వీట్ కార్న్ లో ఉండే ఫోలేట్ గుండె సంబంధిత వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.స్వీట్ కార్న్ లో ఉంటే లుటీన్, జియాక్సాంటిన్ వంటి సమ్మేళనాలు కంటి సంబంధిత వ్యాధులను నిరోధించడంలో సహాయపడుతాయి.
అలాగే స్వీట్ కార్న్ లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి.స్వీట్ కార్న్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్లకు దూరంగా ఉండవచ్చు.అంతేకాకుండా స్వీట్ కార్న్ రక్తహీనత( Anemia )ను నివారిస్తుంది.రోగనిరోధక శక్తిని పెంచుతుంది.స్వీట్ కార్న్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.నీరసం, అలసట వంటి సమస్యలను క్షణాల్లో దూరం చేస్తుంది.
అయితే చాలా మంది ఆరోగ్యానికి మంచిదని స్వీట్ కార్న్ ను అతిగా తింటుంటారు.అతి అనర్థానికి చేటు.
ఇందుకు స్వీట్ కార్న్ కూడా మినహాయింపు కాదు.ఓవర్ గా స్వీట్ కార్న్ తీసుకోవడం వల్ల పలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
ముఖ్యంగా జీర్ణ సమస్యలు( Digestive problems ) తలెతుత్తాయి.అతిగా స్వీట్ కార్న్ తీసుకోవడం వల్ల అందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది.దీంతో అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, విరోచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయి.అలాగే అతిగా స్వీట్ కార్న్ తినడం వల్ల శరీరంలో హానికరమైన టాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి.
చర్మం పై దద్దుర్లు, వాంతులు, అలెర్జీలకు దారితీసే అవకాశాలు ఉంటాయి.మరియు ఆరోగ్యానికి మంచిదని చెప్పి అధికంగా స్వీట్ కార్న్ తింటే శరీర బరువు సైతం అదుపు తప్పుతుంది.