సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా వెలుగొందాడు…ఇక ఇండస్ట్రీ లో ఎవ్వరికి సాధ్యం కానీ రీతి లో మెగాస్టార్ గా తనకంటూ ఉన్న పేరు ను అప్పటినుంచి ఇప్పటివరకు కాపాడుకుంటూ వస్తున్నాడు.
ఇక దాదాపు 40 సంవత్సరాల నుంచి ఒక్కడే మెగాస్టార్ గా ఇండస్ట్రీ మొత్తాన్ని ఎలుతున్నాడు అంటే మామూలు విషయం కాదు.ఇక మెగాస్టార్ కొడుకు అయిన రామ్ చరణ్ కూడా ప్రస్తుతం స్టార్ హీరో గా ముందుకు సాగుతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో కొరటాల శివ( Koratala Siva ) డైరెక్షన్ లో వీరిద్దరి కాంబినేషన్ లో ఆచార్య( Acharya)ను అనే సినిమా వచ్చింది.
ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఎంతో ప్రెస్టేజీయస్ గా వచ్చిన వీళ్ళ కాంబినేషన్ అనేది ప్లాప్ అయింది.దాంతో మెగా అభిమానులు కూడా తీవ్రమైన నిరాశకు గురయ్యారు.
ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి కోలుకోవడానికి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరొక మల్టీస్టారర్ సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమాకి డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న హరీష్ శంకర్( Harish Shankar ) వ్యవహరించనున్నట్టుగా తెలుస్తుంది.అది చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా కావడం అలాగే వచ్చిన సినిమా భారీ ఫ్లాప్ అవడంతో ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ కొట్టి వాళ్ళ అభిమానులకి ఒక మంచి ట్రీట్ ఇవ్వాలని చిరంజీవి అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుడిని మెప్పిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే సినిమాలో బిజీగా ఉన్నాడు.అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో రిలీజ్ కి రెడీ అవుతున్నాడు…
.