Alia Bhatt : ఆ సమయంలో క్లాసులో బెంచీలు తుడిచా.. అలియా భట్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో అలియా భట్( Actress Alia Bhatt ) కు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.బాలీవుడ్ సినిమాలకే పరిమితమైన అలియా భట్ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 Actress Alia Bhatt Cleans Class Room Benches-TeluguStop.com

ఈరోజు అలియా భట్ పుట్టినరోజు కాగా అలియా భట్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.అలియా భట్ బ్యాగ్రౌండ్ ఉన్నా తల్లీదండ్రుల పేరును వాడుకోకుండా సినిమాల్లోకి రావాలని అనుకున్నారు.

తల్లీదండ్రుల సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి రావాలని అలియా భట్ భావించారు.స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా( Student of the Year )తో అలియా భట్ కెరీర్ మొదలైంది.

ఈ సినిమా కోసం అలియా భట్ 16 కిలోల బరువు తగ్గారు.తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న అలియా భట్ కెరీర్ తొలినాళ్లలో ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా నెపోటిజం ప్రస్తావన వచ్చేదని ఆమె పేర్కొన్నారు.

Telugu Bollywood, Tollywood-Movie

ఎంత కష్టపడి పని చేస్తున్నా సినీ బ్యాగ్రౌండ్ ఉండటం వల్లే రాణిస్తున్నానని అనుకునేవారని అలియా భట్ వెల్లడించారు.వైవిధ్యం ఉన్న కథలను ఎంచుకుంటున్న అలియా భట్ గంగూబాయి కఠియావాడి సినిమా( Gangubai Kathiawadi )తో అభిమానులకు ఎంతో దగ్గరయ్యారు.స్టైలిష్ డ్రెస్ లను ధరించి అవార్డుల ఫంక్షన్లకు వెళ్లాలని చాలామంది అనుకుంటారని నా ఓటు మాత్రం శారీకే అని ఆమె చెప్పుకొచ్చారు.అయినా వేసుకునే దుస్తులు కాదని వాటిని ధరించిన మనిషి ముఖ్యమని అలియా భట్ కామెంట్లు చేయడం గమనార్హం.

Telugu Bollywood, Tollywood-Movie

ఆర్.ఆర్.ఆర్( RRR ) తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అలియా భట్ తెలుగులో ఎక్కువ ఆఫర్లు వస్తున్నా ఆ అఫర్లను రిజెక్ట్ చేస్తున్నారు.అలియా భట్ తెలుగులో నటించకపోయినా డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.

ముంబైలో స్కూల్ కెళ్లి బాత్ రూమ్ లో నిద్రపోయేదానినని అందువల్ల టీచర్ వారం రోజుల పాటు తరగతి గదిలోని బెంచీలను తుడవాలని పనిష్మెంట్ ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు.అలియా భట్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube