టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన గొప్ప సినిమాలలో “శంకరాభరణం( Sankarabharanam ) ముందు వరుసలో ఉంటుంది.ఈ సినిమా ఎవర్‌గ్రీన్ హిట్ అని చెప్పుకోవచ్చు.
ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకుల గుండెల్లో స్పెషల్ ప్లేస్ సంపాదించుకుంటుంది.ఇందులో శంకరశాస్త్రి కుమార్తెగా రాజ్యలక్ష్మి నటించింది.
నిజానికి శంకరాభరణం ఆమెకు తొలి సినిమా.ఈ సినిమాతో ఆమెకు చాలా మంచి గుర్తింపు లభించింది దానివల్ల తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనేక అవకాశాలు వచ్చాయి.
రాజలక్ష్మి తన కెరీర్‌లో మొత్తంగా వందకి పైగా సినిమాల్లో యాక్ట్ చేసి అలరించింది.తమిళ టీవీ సీరియల్స్‌లో కూడా నటించే ఆకట్టుకుంది.
ఈ తార రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విషయాలు పంచుకుంది.ఇదే ఇంటర్వ్యూలో 40 ఏళ్ళ కెరీర్‌లో తాను ఎప్పటికీ మర్చిపోలేని ఒక చేదు సంఘటన గురించి కూడా మాట్లాడింది.
రాజ్యలక్ష్మి( Rajyalakshmi ) ఆ సంఘటన గురించి వివరిస్తూ ‘నేను ఒక మలయాళ సినిమాలో కూతురుగా, ఒక సీనియర్ నటి తల్లిగా యాక్ట్ చేశాం.ఈ మూవీలో తల్లి ఒకరి చేతిలో మోసపోయింది.కూతురికి తనలాగా అన్యాయం జరగకూడదని ఆ తల్లి భావిస్తుంది.అలాంటి ఆశతో బతుకుతున్న ఆమెకు ఓ రోజు కూతురు ఓ పార్కులో కుర్రాడితో సరసాలు ఆడుతూ కనిపిస్తుంది.
దాంతో ఆమెకు పట్టరాని కోపం వస్తుంది.కానీ పార్కులో ఎలాంటి గొడవ చేయకుండా ఇంటికి వస్తుంది.
ఆపై ఇంటికి వచ్చిన కూతుర్ని నిలదీస్తుంది.కూతురు కాలేజీకి వెళ్లి వస్తున్నానని అబద్ధం చెబుతుంది.
అప్పటికే కోపంతో రగిలిపోయిన తల్లి అబద్ధాలు చెప్పిన కూతురి చెంప చెళ్లుమనిపిస్తుంది.ఆ సీన్‌ను షూట్ చేయాల్సి ఉంది.” అని చెప్పుకొచ్చింది.
అయితే ఈ సన్నివేశం చేస్తున్న సమయంలో తల్లి కూతురుగా నటిస్తున్న తనను నిజంగానే లాగి గట్టిగా చెంప చెళ్లుమనిపించిందని రాజ్యలక్ష్మి వెల్లడించింది.సాధారణంగా ఇలాంటి సన్నివేశాల్లో కొట్టీ కొట్టినట్లు కొడతారు.కానీ ఆ తల్లి పాత్ర చేసిన సదరు నటి మాత్రం రాజ్యలక్ష్మికి బాగా దెబ్బ తగిలేలా చెంప మీద కొట్టింది.
అలా కొట్టడం చూసి రాజ్యలక్ష్మి షాక్ అయిందట.డైరెక్టర్ కూడా ఆశ్చర్యపోయే “ఏంటి ఆమెతో మీకేమైనా గొడవ ఉందా?” అని అడిగాడట.కానీ తనకు ఎవరితో ఎలాంటి గొడవలు లేవని రాజ్యలక్ష్మి చెప్పిందట.నెక్స్ట్ డే సదరు మదర్ క్యారెక్టర్ చేసిన నటికి గుడ్ మార్నింగ్ చెప్పిందట.
అప్పుడు ఆమె “ఈ గుడ్ మార్నింగ్ నిన్న ఎందుకు చెప్పలేదు” అని ముఖం పట్టుకొని అడిగిందట.గుడ్ మార్నింగ్ చెప్పనందుకే ఆమె ఇలా కొట్టినట్లు రాజ్యలక్ష్మి అర్థం చేసుకుని మరింత షాక్ అయిందట.