2024 ఎన్నికల్లో విజయం సాధించడం వైసీపీకి ఎంత కీలకమో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అంతే కీలకమనే సంగతి తెలిసిందే.ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే పార్టీ భవిష్యత్తుకే ప్రమాదమని టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నిర్ణయాలతో జన సైనికులు విసిగిపోతున్నారు.మొదట మూడింట ఒక వంతు సీట్లలో జనసేన( Janasena ) పోటీ చేస్తుందని చెప్పిన పవన్ తర్వాత 24 సీట్లకు అంగీకరించారు.
కనీసం 24 సీట్లలో అయినా జనసేన పోటీ చేస్తుందని పవన్ అభిమానులు భావించగా చివరకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలలో పోటీకి జనసేన పరిమితమైంది.నాగబాబు ( Nagababu ) ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగినా పొత్తుల వల్ల ఆ ప్రచారం కూడా నిజమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తానని పరోక్షంగా చెబుతున్నా ఆ కామెంట్లను నమ్మాలో లేదో జన సైనికులకు అర్థం కావడం లేదు.

2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 18 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించింది.కనీసం ప్రజారాజ్యం స్థాయిలో జనసేన రాజకీయాల్లో ప్రభావం చూపలేకపోతుంది.జనసేన తరపున చాలా నియోజకవర్గాల్లో టీడీపీ( TDP ) నుంచి జనసేనలో చేరిన నేతలు పోటీ చేయనున్నారు.
ఇలా జరగడం వల్ల టీడీపీ లాభపడుతుంటే జనసేన తీవ్రస్థాయిలో నష్టపోనుంది.

పవన్ సీఎం కావాలని జనసైనికులు కోరుకుంటుండగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినా పవన్ ముఖ్యమంత్రి అవుతారనే సంకేతాలు టీడీపీ వైపు నుంచి లేవు.వ్యూహాలు తనకు వదిలేయాలని పవన్ చెబుతున్నా ఆ వ్యూహాల వల్ల జనసేనకు ఏ స్థాయిలో నష్టం కలుగుతుందో పవన్ ఆలోచించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.2024 ఎన్నికల్లో జనసేనకు అనుకూల ఫలితాలు రాకపోతే పవన్ పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.