Deputy CM Bhatti Vikramarka : లిఫ్ట్ ఇరిగేషన్ తో సాగునీరు..: డిప్యూటీ సీఎం భట్టి

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంటలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి( Lift Irrigation Scheme ) శంకుస్థాపన జరిగింది.ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) శంకుస్థాపన చేశారు.

 Deputy Cm Bhatti Vikramarka : లిఫ్ట్ ఇరిగేషన్ తో-TeluguStop.com

శంకుస్థాపన కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) మాట్లాడుతూ లిఫ్ట్ ఇరిగేషన్ తో సుమారు పది వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి వలనే ఇంత తొందరగా శంకుస్థాపన చేసుకున్నామని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు.ఇందులో భాగంగానే ఆరు గ్యారెంటీ పథకాలను పూర్తిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.రాష్ట్రాన్ని రూ.6 లక్షల కోట్ల అప్పుల ఊబిలోని నెట్టిన ఘనత బీఆర్ఎస్ ది అని విమర్శించారు.మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube