Arkansas Restaurant Waitress : కస్టమర్ నుంచి రూ.3 లక్షలు టిప్పుగా పొందిన మహిళ.. అదే శాపమైంది..?

సాధారణంగా హోటల్లో పనిచేసే సర్వర్లకు కస్టమర్లు టిప్స్ అందిస్తుంటారు.కొంతమంది వారి జీవితాలను బాగు చేయాలనే ఉద్దేశంతో భారీగా టిప్పులను అందిస్తుంటారు.

 Us Woman Working At Restaurant Fired After She Received Rs 3 Lakh As Tip-TeluguStop.com

దీనివల్ల వెయిటర్లు ఎంతో సంతోషిస్తారు.కానీ ఓ వెయిట్రెస్‌కి( Waitress ) భారీగా టిప్పు పొందడమే శాపంగా తయారయ్యింది.

యూఎస్ఎలోని అర్కాన్సాస్‌లో( Arkansas ) ఓవెన్ అండ్ ట్యాప్ రెస్టారెంట్‌లో( Oven And Tap Restaurant ) పనిచేస్తున్న ఈ వెయిట్రెస్‌కి కస్టమర్లు 4400 డాలర్లు లేదా దాదాపు 3 లక్షల రూపాయల పెద్ద టిప్‌ని అందించారు.దాని తర్వాత ఆమె కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంది.

ఈ టిప్ ఆమె, మరొక సర్వర్ కోసం కస్టమర్లు అందించారు, అయితే రెస్టారెంట్ మేనేజర్ ఆమె 20% మాత్రమే తీసుకోవాలని, మిగిలిన మొత్తాన్ని ఇతర సిబ్బందితో పంచుకోవాలని చెప్పారు.దీనికి ఆమె అంగీకరించకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారు.

టిప్ ఇచ్చిన కస్టమర్లు గ్రాంట్ వైజ్ ( Grant Wise ) అనే రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని ప్రారంభించిన ‘$100 డిన్నర్ క్లబ్’లో భాగం.అతని సమూహంలోని ప్రతి వ్యక్తి రెస్టారెంట్‌కు మద్దతుగా 100 డాలర్లు లేదా దాదాపు 8000 రూపాయలను టిప్‌గా ఇచ్చాడు.

Telugu Club, Arkansas, Tip, Grant Wise, Oventap, Loans, Tip Policy, Restaurant,

సిబ్బంది మధ్య టిప్స్( Tips ) పంచుకునే విధానం లేదని నిర్ధారించుకోవడానికి వైజ్ వారి సందర్శనకు ముందు రెస్టారెంట్‌ను చెక్ చేసారు, అక్కడ ఆ పాలసీ లేదని అతనికి చెప్పారు.అయితే టిప్ పాలసీ గురించి వైజ్‌కి చెప్పిన వెయిట్రెస్‌ని తొలగించారు.దాని గురించి అతను తెలుసుకున్నాడు.ఎడ్యుకేషన్ లోన్స్ తో సతమతమవుతున్న వెయిట్రెస్ డబ్బు కోసం చాలా ఆశపడింది.కస్టమర్లు కోరిన విధంగా ఇద్దరు సర్వర్లకు టిప్ ఇచ్చామని రెస్టారెంట్ పేర్కొంది.వెయిట్రెస్‌ను ఎందుకు తొలగించామనే దాని గురించి మాత్రం పెదవి విప్పలేదు.

Telugu Club, Arkansas, Tip, Grant Wise, Oventap, Loans, Tip Policy, Restaurant,

వైజ్ వెయిట్రెస్ జాబ్ కోల్పోయిందనే విషయం గురించి తెలుసుకున్న తర్వాత, అతను టిప్ డబ్బును తిరిగి ఇవ్వమని రెస్టారెంట్‌ను అడిగాడు.దానిని తిరిగి పొందిన తర్వాత, రెస్టారెంట్ వెలుపల వెయిట్రెస్‌కి ఇవ్వడం ద్వారా తన మంచి మనసును చాటుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube