తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ దివి( Bigg Boss Divi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నటిగా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకొంది.
బిగ్బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది.అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మకు అనుకున్న రేంజ్ లో అవకాశాలు మాత్రం రావడం లేదు.
మోడలింగ్ నుంచి యాక్టింగ్ కు వచ్చిన తనకు లెక్కలేనన్ని తిరస్కరణలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది.మరీ ముఖ్యంగా రవితేజ సినిమా( Raviteja Movie ) కోసం ఎంపిక చేసి, రాత్రికిరాత్రి తొలిగించారని చెప్పుకొని బాధపడింది.
ఈ మేరకు దివి( Divi ) మాట్లాడుతూ.నన్ను మొహం మీదే తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి.నేను సన్నగా ఉన్నానని ఒకరు రిజెక్ట్ చేశారు.మరొకరు నేను లావుగా ఉన్నానని రిజెక్ట్ చేశారు.సన్నగా మారమంటారు, మారితే రిజెక్ట్ చేస్తారు.వీటికంటే ఘోరం ఏంటంటే రీసెంట్ గా ఒక సినిమాలో నేను సెలక్ట్ అయ్యాను.
అది రవితేజ సినిమా.రవితేజ ( Raviteja ) పక్కన లీడ్ క్యారెక్టర్ నాది.
ఇంకో 5 రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందనగా రాత్రికి రాత్రి నన్ను మార్చేశారు అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాల్ని బయటపెట్టింది దివి.
ఎన్నో ఆఫీసులు తిరిగానని ఒక దశలో తనపై తనకు నమ్మకం కూడా పోయింది అని ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది దివి.అలాగే అవకాశాల కోసం చాలా ఆఫీసులు తిరిగాను, ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను, చాలామంది రిజెక్ట్ చేశారు.ఫోన్ చేస్తామంటారు, ఇంటికెళ్లిన తర్వాత కాల్ రాదు.
బాత్రూమ్ లో షవర్ పెట్టుకొని, నోరు మూసుకొని ఎన్నోసార్లు ఏడ్చాను.బెడ్ పై దిండు కవర్ చేసుకొని చాలాసార్లు ఏడ్చాను.
అమ్మానాన్నలకు తెలిస్తే బాధపడతారు, తిడతారని చెప్పేదాన్ని కాదు అని ఆమె తెలిపింది.