PM Narendra Modi : మూడు పార్టీల ముకుమ్మడి సభ .. ప్రధాని హాజరు

ఏపీలో అధికారం లోకి రావడమే లక్ష్యంగా టిడిపి,  జనసేన, బిజెపిలు కూటమిగా( TDP Janasena BJP Alliance ) ఏర్పడ్డాయి.వైసీపీని ఓడించి అధికారాన్ని పంచుకోవాలని ఈ మూడు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి .

 Pm Narendra Modi Attending Tdp Bjp Janasena Meeting At Chilakaluripeta-TeluguStop.com

ఇప్పటికే సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది.అభ్యర్థుల ప్రకటన విడతల వారీగా చేపట్టారు.

పూర్తిస్థాయిలో జాబితాను ప్రకటించేందుకు మూడు పార్టీలు సిద్ధమవుతున్నాయి.ఇదిలా ఉంటే టిడిపి , జనసేన,  బిజెపి లు కూటమిగా ఏర్పడిన తర్వాత తొలి సభను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సభ ద్వారా ఎన్నికల సమర శంఖారావం పూరించి,  వైసిపి ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలనే లక్ష్యంతో మూడు పార్టీల నేతలు సభను ఏర్పాటు చేస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Janasena, Janasenani, Pawan Kalyan-Politics

ఈ మేరకు ఈరోజు ఉదయం 9:32 గంటలకు సభ ఏర్పాట్లకు సంబంధించి భూమి చేయాలని మూడు పార్టీలకు చెందిన నాయకులు నిర్ణయించారు.  చిలకలూరిపేట లో( Chilakaluripeta ) నిర్వహించబోయే ఈ సభ ద్వారా జగన్ పతనానికి నాంది పలుకుతామని కూటమి నేతలు ప్రకటనలు చేస్తున్నారు.సభ నిర్వహణకు సమయం తక్కువగా ఉండడంతో,  ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.

  ఈనెల 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోది( PM Narendra Modi ) ఏపీ పర్యటన దాదాపుగా ఖరారు అయింది .ఈ మేరకు 17వ తేదీనే చిలకలూరిపేటలో టిడిపి , బిజెపి , జనసేన ఉమ్మడి సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఆరోజు సాయంత్రం ఐదు గంటలకు ఏర్పాటు చేశారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Janasena, Janasenani, Pawan Kalyan-Politics

ప్రధాని నరేంద్ర మోది ఈ సభకు హాజరు కాబోతున్నారు.ఈ సభ ద్వారా ఒకే వేదికపై ప్రధాని నరేంద్ర మోది,  చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు.దీంతో ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా మూడు పార్టీలు తీసుకున్నాయి .ఈ సభల నిర్వహణ కు  ఇప్పటికే ఉమ్మడిగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు , నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది తరలివచ్చే విధంగా భారీ గా జన సమీకరణ పై దృష్టి పెట్టారు.

  వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలకు జనం పోటెత్తుతూ ఉండడంతో, అంతకంటే భారీ స్థాయిలో జనాలు తమ సభకు హాజరయ్యే విధంగా మూడు పార్టీలు దృష్టి పెట్టాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube