ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే టాలీవుడ్ లో ఒక్కసారి క్లిక్ అయ్యాక అందరు చూపు బాలీవుడ్ పైనే ఉంటుంది.ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్స్ సైతం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కూడా మన తెలుగు హీరోయిన్స్ మాత్రం మామూలు ముదుర్లు కాదు.
ఏ మాత్రం అవకాశం చిక్కిన ఏ ఖాన్ పక్కన లేదా కపూర్ పక్కను నటించాలనే కోరిక వీరిలో బాగా కనిపిస్తుంది.సరే ఎలాగో అవకాశాలు వస్తాయి అది వేరే విషయం.
కానీ ఇప్పుడు ఒక ఇద్దరు బ్యూటీలు మాత్రం తమ ఆశలన్నీ బాలీవుడ్ పైన( Bollywood ) పెట్టుకున్నారు.టాలీవుడ్ లో అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నారు ఆ ఇద్దరు హీరోయిన్స్.మరి ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు ? వారు చేస్తున్న సినిమాలు ఏంటి ? అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పూజా హెగ్డే
చాలా రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ అమ్మడు దూరం అయిపోయింది.గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాల నుంచి ఆమె పక్కకు తప్పుకుంది.అందుకు ఎవరి కారణాలు వారికున్నాయి అనేది వాస్తవం.
అందుకే తెలుగు సినిమాల గురించి పెద్దగా ఇప్పుడు ఈ అమ్మడు ఆలోచించడం లేదు.బాలీవుడ్ లోనే పాగా వేయాలని బాగా ప్రయత్నాలు చేస్తోంది.
ఆ కోవలోనే ఒక విభిన్నమైన సినిమాలో నటిస్తోంది.ఈ సినిమా విజయం సాధిస్తే ఇక పూజ బాలీవుడ్లో సెటిల్ అయినట్టే.
ఇప్పటికే షాహిద్ కపూర్( Shahid Kapoor ) దేవా చిత్రంలో( Deva Movie ) నటిస్తున్న పూజా హెగ్డే( Pooja Hegde ) ఇప్పుడు సాంకి చిత్రంలో( Sanki Movie ) కూడా నటిస్తుంది.ఈ సినిమా లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతుంది.
ఇప్పటికే చాలా లవ్ స్టోరీస్ లో నటించినప్పటికీ పూజ ఇది నాకు ప్రత్యేకమైన సినిమా చెబుతోంది మరి చూడాలి.ఈ సినిమా అయినా తనకు అదృష్టాన్ని ఇస్తుందో లేదో.!
ప్రజ్ఞ జైస్వాల్
కంచె సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది ప్రజ్ఞ. కానీ ఆమెకు సక్సెస్ మాత్రం అంత ఈజీగా దొరకలేదు.చాల సినిమాల్లో నటించిన ఈ నటి అప్పుడప్పుడు విజయాలను కూడా సొంతం చేసుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రజ్ఞా జైస్వాల్( Pragya Jaiswal ) హీరోయిన్ గా ఎదగలేకపోయింది.దాంతో ఈ అమ్మడు చూపు కూడా బాలీవుడ్ పై పడింది.
ప్రస్తుతం ఖేలే ఖేల్ మెయిన్( Khel Khel Mein ) సినిమాలో అక్షయ్ కుమార్( Akshay Kumar ) సరసనా ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తోంది చాలా రొటీన్ కి భిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది అంటూ ఊదరగొడుతోంది.మరి చూడాలి ఏ రేంజ్ లో ఈ అమ్మడికి కూడా అదృష్టం కలిసి వస్తుందో.