రాజన్న సిరిసిల్ల జిల్లా :సాగు నీరందక వరి పంటలు ఎండిపోతున్నాయి.సాగు నీటిపై ఆధారపడిన రైతుల ( Farmers )పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.
ప్రాజెక్టుల నీరందుతుందనే ఆశతో కొందరు రైతులు వరి నాట్లు వేయగా, వరినాట్లు వేసిన చోట సాగునీరు అందక పొలాలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి.సాగునీరు రాకపోవడంతో పొలాలు నెర్రవారి చేతికిరాకుండా పోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపురం గ్రామంలో 800 వందల ఎకరాల వరి పొలం కు రైతన్నలు నిప్పు పెట్టారు.
ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపురం గ్రామంలో అనంతసాగర్ రిజర్వాయర్( Anantasagar Reservoir ), మిడ్ మానేరు ప్రాజెక్టుల నుండి సాగునీరు వస్తుందని ఆశతో గ్రామంలో 800 వందల ఎకరాలలో వరి పంట సాగు చేసినారు.ప్రాజెక్టుల నుండి సాగునీరు అందకపోవడంతో పంట పొలాలు ఎర్రలు భారీ ఎండిపోయినాయి.
ఎండిన వరి పొలం పశువుల గాసముకు కూడా పనికిరాదు అని, దాని కోయాలంటే ఎకరానికి ఐదు నుంచి 6000 వరకు అవుతాయని, ఇప్పటికే నాట్లు వేసి అప్పుల పాలయ్యామని, మళ్లీ కోయడానికి అప్పులు చేయాల్సి వస్తుందని, దీంతో చేసేది ఏమీ లేక పంట పొలాలకు నిప్పు పెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఎవరు కూడా రైతులను పట్టించుకోవడం లేదు అని, ప్రాజెక్టులో నీళ్లు ఉండి కూడా విడవకపోవడంతోనే పంట పొలాలు ఎండిపోయాయని రైతులుకన్నీరు మున్నీరు అయ్యారు
.






