నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని హైదరాబాద్- నాగార్జునసాగర్ ప్రధాన జాతీయ రహదారిని ఆనుకొని డ్రైనేజీని అక్రమిస్తూ అక్రమ కట్టడాలు వెలుస్తున్నా సంబధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఈ అక్రమ కట్టడాల వలన నిత్యం పార్కింగ్ సమస్య తలెత్తి ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని,ఆదివారం వస్తే చాలు మొత్తం ఆక్రమించి రోడ్డు మూసుకుపోవడంతో పట్టణ నలుమూలల నుండి వచ్చే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని వాపోతున్నారు.
మురికి కాలువ కబ్జా చేస్తూ జాతీయ రహదారిని ఆనుకుని ఇష్టారాజ్యంగా అక్రమ కట్టడాలను కడుతున్న వారిపై చర్యలు తీసుకొని,టాపిక్ సమస్య తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు.







