దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)( Citizenship Amendment Act ) ఇవాల్టి నుంచి అమల్లోకి రావడం జరిగింది.సిఏఏ 2019 కోసం త్వరలో అందుబాటులోకి తెచ్చే పోర్టల్ లో పౌరసత్వం కోసం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం బాధితులను కోరింది.2014కు ముందు బంగ్లాదేశ్, ఆఫ్గాన్, పాకిస్తాన్ నుంచి భారత్( India ) కు వలస వచ్చిన హిందువులు సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సిల్లు, క్రిస్టియన్లకు పౌరసత్వం ఇస్తారు.ఈ క్రమంలో శరణార్థులను మతం ప్రాతిపదికన వేరు చేయడాన్ని విపక్షాలు పలు పౌర హక్కుల సంఘాలు తప్పుపడుతున్నాయి.
దీనిపై ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

పరిస్థితి ఇలా ఉంటే సిఏఏ పై తమ అభిప్రాయం మారదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ స్పష్టం చేశారు.ఇది మత విభజన చట్టం.ముస్లింలను ద్వితీయ శ్రేణికి తగ్గించాలనే గాడ్సే ఆలోచనలకు ప్రతిరూపం.
వలస వచ్చిన వారికి ఆశ్రయం ఇవ్వండి.కానీ మతాన్ని బట్టి పౌరసత్వాన్ని ఇవ్వొద్దు.
ఐదేళ్లు పెండింగ్ లో ఉంచి ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో చెప్పాలి అని నిలదీశారు.ఎన్పీఆర్, సిఏఏ అంటే ముస్లింలను టార్గెట్ చేయటమే.
వీటి వ్యతిరేకులు మళ్లీ వీధుల్లోకి రాక తప్పదు.అని అసదుద్దీన్ ( Asaduddin )పేర్కొన్నారు.
పరిస్థితి ఇలా ఉండగా కేంద్రం అమల్లోకి తెచ్చిన కేరళ( Kerala )లో అమలుచేయం అని కేరళ సీఎం పినరయి విజయన్( Pinarayi Vijayan ) తీవ్రంగా వ్యతిరేకించారు.







