ప్రస్తుతం ఐపీఎల్ స్టార్ట్ అవ్వనున్న నేపథ్యంలో ఇప్పుడు ఐపీఎల్ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే అనౌన్స్ చేశారు.ఇక ఐపీఎల్ లో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మెగా ఆక్షన్ నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక 2022 లో మెగా ఆక్షన్ జరగడం వల్ల 2025 వ సీజన్ లో మళ్ళీ మెగా ఆక్షన్ జరగబోతున్నట్టుగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అయిన అరుణ్ ధుమాల్ స్పష్టం చేశాడు.
అయితే దీని మీద ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఈ విషయాన్ని కొన్ని టీమ్ లు ఖండిస్తున్నాయి.ఇక ఐపీఎల్ మెగా ఆక్షన్ లో ప్లేయర్లని వాళ్ళ ఆట తీరును బట్టి వాళ్లని ఆయా టీమ్ లకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.మూడు సంవత్సరాలకు ఒకసారి ఇలా మెగా ఆక్షన్ పెట్టడం వల్ల వాళ్లని మౌల్డ్ చేసుకున్న తర్వాత ఆ టీము లా నుంచి ఆ ప్లేయర్లు ఇంకో టీం కి వెళ్లడం ఆ టీమ్ లకి చాలా ఇబ్బందికరంగా మారబోతుంది.
ఇక 2022 మెగా యాక్షన్ ను కనక మనం ఒకసారి చూసినట్లయితే ఆ ఆక్షన్ కి ముందు ముంబై ఇండియన్స్( Mumbai Indians ) టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది.చాలామంది ఇండియన్ ప్లేయర్లు ఆ టీమ్ లో ఉండేవారు.
అందువల్ల ఈజీగా ముంబై మ్యాచులను గెలుచుకుంటూ వచ్చేది.కానీ 2022 లో ఎప్పుడైతే మెగా ఆక్షన్ జరిగిందో అప్పుడు ఆ టీంలో ఉన్న ప్లేయర్లందరూ వేరే వేరే టీం లోకి వెళ్లడం వల్ల ఆ టీమ్ చాలా వరకు వీక్ అయింది.అందుకే ఈ మెగా ఆక్షన్ వల్ల ముంబై ఇండియన్స్ లాంటి పెద్ద టీం దెబ్బ పడింది.అందువల్లే కొన్ని టీంలు ఈ మెగా ఆక్షన్ ని వ్యతిరేకిస్తున్నాయి.
మరి ఈ ఆక్షన్ ను కంట్రోల్ చేస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…
.