కష్టపడి ప్రయత్నిస్తే ఆలస్యంగా అయినా సక్సెస్ దక్కుతుందనే సంగతి తెలిసిందే.అయితే ఒకే సమయంలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సులువైన విషయం కాదు.
అయితే ఖమ్మం జిల్లా( Khammam District ) తల్లంపాడుకు చెందిన చక్రపాణి( Chakrapani ) తన సక్సెస్ తో ప్రశంసలు అందుకుంటున్నారు.ఎంఎస్సీ బీఈడీ చదివిన చక్రపాణి 2023 సంవత్సరంలో గురుకుల ఉద్యోగాల కోసం పరీక్ష రాయడం జరిగింది.
ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలను సాధించిన చక్రపాణి తన సక్సెస్ తో ప్రశంసలు అందుకుంటున్నారు.మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన చక్రపాణి సక్సెస్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.
చక్రపాణి సక్సెస్ విషయంలో తల్లీదండ్రులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

చక్రపాణి భవిష్యత్తులో మరిన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.చక్రపాణికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.చక్రపాణి బాల్యం నుంచి చదువులో చురుకుగా ఉండేవారని సమాచారం అందుతోంది.

చక్రపాణి మూడు ఉద్యోగాలలో జూనియర్ లెక్చరర్ జాబ్( Junior Lecturer Job ) లో చేరనున్నట్టు వెల్లడించడం గమనార్హం.చక్రపాణి టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.వస్తే ఉద్యోగం లేకపోతే అనుభవం అంటూ ప్రిపేర్ అయిన చక్రపాణి తన ప్రతిభతో ప్రశంసలు అందుకుంటున్నారు.చక్రపాణి అన్న ఆటోడ్రైవర్ గా పని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తుండటం గమనార్హం.
చక్రపాణి సక్సెస్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.ఆంతోటి చక్రపాణి కెమిస్ట్రీ లెక్చరర్ జాబ్ లో జాయిన్ కానుండగా నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
గత ఐదేళ్లుగా ఔట్ సోర్సింగ్ లెక్చరర్ గా ఆయన పని చేస్తున్నారని భోగట్టా.అనుభవం కూడా ఉండటం అతని కెరీర్ కు మరింత ప్లస్ కానుందని చెప్పవచ్చు.







