తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న రజనీకాంత్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు.ఇక జైలర్ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న రజినీకాంత్ తన కూతురు అయిన ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్ లో వచ్చిన లాల్ సలామ్ సినిమాలో రజినీకాంత్ గెస్ట్ పాత్రలో నటించాడు.
ఈ పాత్ర కూడా తనకి చాలా గుర్తింపుని తీసుకొస్తుంది అని అందరు అనుకున్నారు.కానీ అందరూ ఊహించిన దానికి బిన్నంగా ఈ సినిమా రెండు భాషల్లో డిజాస్టర్ గా మిగిలింది.
రజనీకాంత్ మరోసారి తన కూతురును నమ్మి భారీగా దెబ్బతిన్నాడని చాలామంది అతన్ని విమర్శించారు.ఇక ఇప్పటికే సౌందర్య రజనీకాంత్ డైరెక్షన్ లో చేసిన కొచ్చాడియాన్ అనే సినిమా తీసి భారీ డిజాస్టర్ కి మూట గట్టుకున్నాడు.

ఇక మరో కూతురు అయిన ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో లాల్ సలామ్ అనే సినిమా చేసి మరో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మళ్ళీ ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో రజినీకాంత్ ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ న్యూస్ తెలిసిన రజనీకాంత్ అభిమానులందరూ రజనీకాంత్ మీ కూతుళ్ల తో తప్ప మిగిలిన ఏ డైరెక్టర్ తో అయిన సరే సినిమాలు చేయండి సార్ అంటూ తన అభిమానులు అయానకి పర్సనల్ గా మెసేజ్ లు పెడుతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఇప్పటికే వీళ్లిద్దరి కూతుర్ల దెబ్బకి రజనీకాంత్ చాలా వరకు డీలాపడ్డాడు.ఈ సమయంలో మల్లి ఐశ్వర్య రజనీకాంత్ తో సినిమా చేసి ఎందుకు దెబ్బ తినడం అనే ఉద్దేశంలో ఆయన అభిమానులు అనుకుంటున్నారు.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనక రాజ్ తో ఒక సినిమా చేస్తున్నాడు.








